చిన్నప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా అంటూ బోరున ఏడ్చేసిన స్టార్ హీరోయిన్..
తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురుగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్. తనదైన నటనతో తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ అభిమానులను సంపాదించుకుంది ఈ భామ. తెలుగులో రవితేజ నటించిన క్రాక్, తేజ సజ్జా హనుమాన్, బాలయ్య వీర సింహారెడ్డి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న ఈ భామ.. రీసెంట్ గానే తన బాయ్ ఫరెండద ని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితం లోకి అడుగుపెట్టింది.
ఇక అటు సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాల్లో అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తోంది. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈమె లైవ్ లోనే అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంది. ఓ డాన్సర్ తన జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులు గురించి వాపోయింది. ఈ క్రమంలోనే ఆమె ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంది. ఈ క్రమంలోనే వరలక్ష్మి శరత్ కుమార్ సైతం డాన్సర్ జీవితంలో ఎలాగైతే జరిగిందో.. తన జీవితంలో కూడా అలానే జరిగింది అంటూ షాక్ ఇచ్చింది.

నేను చిన్నతనంలోనే లైంగిక వేధింపుల బారిన పడ్డాను. నీది నాదీ ఒకటే కథ అంటూ వరలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. సదరు డాన్సర్ ని చూస్తుంటే తన జీవితమే మళ్ళీ గుర్తొచ్చేసింది అని.. చిన్నప్పుడు అలాంటి బాధలను ఎదుర్కొన్నానని చెబుతూ వరలక్ష్మి శరత్ కుమార్ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారింది. దీంతో స్టార్ హీరో కూతురు అయిన వరలక్ష్మి సైతం చిన్నతనంలో లైంగిక వేధింపుల బారిన పడడం ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఇక రీసెంట్ విశాల్, వరలక్ష్మి నటించిన మదగజరాజ సినిమా 12 ఏళ్ల తర్వాత ఈ ఏడాది సంక్రాంతి కానుకగా కోలీవుడ్‌లో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు సుందర్. సి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ శివంగి సినిమాలో నటిస్తుంది. దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications