ఆ వయస్సులోనే తల్లిని కావాలని ప్రయత్నించా.. బాలకృష్ణ చెల్లెలు
వరలక్ష్మి శరత్ కుమార్ పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరలక్ష్మి శరత్ కుమార్‌కు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటిస్తూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. రవితేజ ''క్రాక్'' ,బాలకృష్ణ ''వీరసింహారెడ్డి''.. సినిమాల్లో వరలక్ష్మి నటనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇటీవలే ఈ భామ తన పెళ్లికి సంబంధించి అప్డేట్ ఇచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం నికోలయ్ సచ్ దేవ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది.
వరలక్ష్మి ప్రియుడు నికోలయ్ సచ్ దేవ్ ముంబైలో ఒక ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్నారు. 14 ఏళ్లుగా కొనసాగుతున్న తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోబోతున్నామంటూ ఈ జంట ప్రకటించింది. ఇప్పటికే వీరిద్దరు నిశ్చితార్థంతో ఒకటైయ్యారు. వరలక్ష్మి శరత్ కుమార్‌కు ఇది మొదటి పెళ్లి కాగ, ప్రియుడు నికోలయ్ సచ్ దేవ్‌కు రెండో వివాహం కావడం విశేషం.ఇదిలా ఉంటే వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఓ మీడియా ఛానెల్‌లో మాట్లాడుతూ.. పెళ్లి , పిల్లలు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినీ ,వ్యక్తిగత జీవితాన్ని తాను సరిగా ప్లాన్ చేసుకోలేదని ఆమె తెలిపింది. నాకు 28 సంవత్సరాలు వచ్చే వరకు హీరోయిన్‌గా సినిమాలు చేయాలని అనుకున్నానని.. 32 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకుని 34 సంవత్సరాల వయసులోనే తల్లిని కావాలనుకున్నాను.కానీ నేను అనుకున్న ప్రకారం ఏది జరగలేదని వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పుకొచ్చింది.ఇప్పుడు నా వయసు 38 అంటూ ఆమె వెల్లడించారు.తన మొదటి సినిమా తర్వాత నేను సినిమాలపై ఫోకస్ పెట్టి ఉంటే నా కెరీర్ బాగుండేదని ..అలా కాకుండా తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడమే నేను చేసిన పెద్ద తప్పు అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications