Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాగచైతన్యతో నటించను .. స్టార్ హీరో కూతురు

అక్కినేని నట వారసుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత, తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. అయితే నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు . కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

నాగచైతన్య వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా ఏం లేదు. హీరోయిన్‌ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య..కొద్దిరోజులకే ఆమెకు విడాకులిచ్చాడు. తాజాగా నాగచైతన్యకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్ని కోట్లు ఇచ్చిన నాగచైతన్య పక్కన నటించనని ఓ హీరోయిన్ తేల్చి చెప్పిందట. ఆమె మరెవ్వరో కాదు వరలక్షి శరత్ కుమార్.

Varalaxmi Sarathkumar rejected naga chaitanya movie

కెరీర్ స్టార్టింగ్‌లో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన వరలక్ష్మి ఆ తరువాత తెలుగు,తమిళ భాషల్లో విలన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. రవితేజ ''క్రాక్'' ,బాలకృష్ణ ''వీరసింహారెడ్డి''.. సినిమాల్లో వరలక్ష్మి నటనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే వరలక్షి శరత్ కుమార్‌కు నాగచైతన్యతో నటించే ఛాన్స్ వచ్చిన రిజెక్ట్ చేసిందట. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నాగచైతన్యతో నటించనంటూ వరలక్షి శరత్ కుమార్‌ తెగేసి చెప్పేసిందట. దీనికి కారణం సమంతేనని తెలుస్తోంది.

సమంత, వరలక్షి శరత్ కుమార్‌‌ల మధ్య మంచి స్నేహం ఉంది. నాగచైతన్య ,సమంతకు విడాకులు ఇవ్వడంతోవరలక్షి శరత్ కుమార్‌ అతనితో నటించనని చెప్పిందట. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తరువాత చాలామంది హీరోయిన్స్ నాగచైతన్యతో నటించమంటూ ఓపెన్ గానే చెప్పేశారని టాక్ ఇండస్ట్రీలో ఉంది. అందులో వరలక్ష్మి శరత్ కుమార్‌ కూడా ఒకరని అంటున్నారు. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్‌ నాగచైతన్యకు నో చెప్పారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+