ఎవరు చేయని లొకేషల్‌లో మహేష్ బాబు "వారణాసి" మూవీ షూటింగ్
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ "వారణాసి". టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
రీసెంట్ గానే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రోటర్' పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో భాగంగానే ఈ చిత్రం టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేసి.. గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. అలానే మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవ్వగా.. అంతర్జాతీయ స్థాయిలో మూవీపై అంచనాలను పెంచేశాయి. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, భారతీయ పురాణాలు.. ఆధ్యాత్మిక అంశాలతో పాటు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.

కాగా గత కొద్దిరోజులుగా అంటార్కిటికాలోని మైనస్ డిగ్రీల చలిలో, ఎవరూ ఊహించని లొకేషన్లలో రాజమౌళి అండ్ టీమ్ షూటింగ్ చేస్తున్నారని సమాచారం. భారతీయ సినిమా చరిత్రలో అంటార్కిటికాలో షూట్ జరుపుకుంటున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. మహేష్ బాబుకి సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను అక్కడ పూర్తి చేశారు. ఈ షార్ట్ షెడ్యూల్ మరికొద్ది రోజుల్లోనే ముగియనుంది. ఇప్పటికే సుదీర్ఘమైన కాశీ షెడ్యూల్‌ను పూర్తి చేసిన టీమ్, అక్కడి ఆధ్యాత్మికతను కెమెరాలో బంధించింది. ఆ తర్వాతే ఈ గ్లోబల్ అడ్వెంచర్ అంటార్కిటికా వైపు మళ్లింది.
ఇక అంటార్కిటికా షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర యూనిట్ చిన్న బ్రేక్ తీసుకోనుంది. ఆ తర్వాత జూన్ నెలలో హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్‌లో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ గ్యాప్‌లో రాజమౌళి అండ్ టీమ్ మెక్సికోలో జరగనున్న Comic Con (CCXP) ఈవెంట్‌లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ కోసం రాజమౌళి తన పంథా మార్చుకొని సమ్మర్ బ్రేక్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయంపై అటు సినీ వర్గాలు, ఇటు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications