ఏం ప్లాన్ చేశావ్ జక్కన్న.. "అంటార్కిటికా"లో మహేష్ "వారణాసి" షూటింగ్ !

సూపర్ స్టార్ మహేష్‌ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ "వారణాసి". టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ మూవీ ద బ్లఫ్'.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ అవుతూ పాజిటివ్ టాక్ తో టాప్ లో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ పోస్టులో ద బ్లఫ్ ఒక అద్భుతమైన చిత్రం. యాక్షన్, ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ప్రియాంక చోప్రా తన నటనతో మరోసారి మెప్పించారు అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక మహేష్ బాబు చేసిన పోస్టుకు ప్రియాంక చోప్రా రిప్లై ఇస్తూ చేసిన కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. వారణాసి షూటింగ్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.

varanasi-starring-mahesh-babu-and-priyanka-chopra-movie-shooting-at-antarctica-and-posts-goes-viral

ఏం రిప్లై ఇచ్చారంటే..

థాంక్యూ మహేశ్.. సీ యూ సూన్ ఇన్ అంటార్కిటికా!" అంటూ కామెంట్ చేసింది. దీంతో వారణాసి సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అంటార్కిటికాలో ఉండబోతోందని జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆఫ్రికాలోని నైలు నది పరిసరాల్లో ఈ మూవీ కోసం కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు అంటార్కిటికాలో షూటింగ్ చేస్తుండడంతో.. అక్కడ షూటింగ్ చేసే తొలి భారతీయ మూవీగా కూడా నిలవనుంది. దీంతో జక్కన్న అసలు ఏం ప్లాన్ చేశావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

రీసెంట్ గానే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రోటర్' పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో భాగంగానే ఈ చిత్రం టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేసి.. గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. అలానే మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవ్వగా.. అంతర్జాతీయ స్థాయిలో మూవీపై అంచనాలను పెంచేశాయి. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, భారతీయ పురాణాలు.. ఆధ్యాత్మిక అంశాలతో పాటు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+