తండ్రి కాబోతున్న వరుణ్..దేవుడా అంటూ షాకిచ్చిన సమంత
హీరో వరుణ్ శుభవార్త అభిమానులకు చెప్పారు. తాను తండ్రి కాబోతున్నట్టు ఆయన ప్రకటించారు. వరుణ్ అంటే మెగా హీరో వరుణ్ తేజ్ అనుకుంటే పొరపాటు పడినట్టే. తండ్రి కాబోతుంది మన తెలుగు హీరో కాదు ..బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్. తాను తండ్రి కాబోతున్నట్టు వరుణ్ ధావన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ అనే అమ్మాయిని వరుణ్ ధావన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల క్రితమే వీరి పెళ్లి కగా, తాజాగా తాము పేరెంట్స్‌గా మారుతున్నామంటూ వరుణ్ తెలిపాడు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. భార్య నటాషా దలాల్‌తో బేబీ బంప్‌పై వరుణ్ ధావన్ ముద్దు పెడుతున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

తాము తల్లిదండ్రులుగా కాబోతున్నాం.. మీ అందరి ప్రేమ , ఆశీస్సులు మాపై ఉండాలంటూ వరుణ్ ధావన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. వరుణ్ ధావన్ పోస్టుకు తెలుగు స్టార్ హీరోయిన్ సమంత రిప్లై ఇచ్చారు. ఓ మై గాడ్ అంటూ స్పందించింది. వరుణ్ ధావన్ - నటాషా దలాల్ దంపతులకు సమంత కంగ్రాట్స్ చెప్పారు.
జాన్వీ కపూర్, మౌని రాయ్, కరణ్ జోహార్, భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్, రాశి ఖన్నా, మానుషి చిల్లర్, మలైకా అరోరా, మనీష్ పాల్ మొదలగు సెలబ్రిటీలు వరుణ్ ధావన్ - నటాషా దలాల్ దంపతులకు బెస్ట్ విషెష్ తెలుపుతున్నారు. ఇక వరుణ్ ధావన్ కెరీర్ విషయానికి వస్తే..గతేడాది బవాల్ అనే సినిమాతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ ధావన్, హీరోయిన్ కీర్తి సురేష్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతుంది.












Click it and Unblock the Notifications