సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సమంత - వరుణ్ ధావన్ బోల్డ్ వీడియో

ఏడాదిన్నరకు పైగా సినిమాలు చేయనప్పటికీ తెలుగులో స్టార్ హీరోయిన్ గా, నెంబర్ వన్ హీరోయిన్ గా సమంత చెలామణి అవుతోంది. ప్రస్తుతం మా ఇంటి బంగారం పేరుతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా సొంత బ్యానరులో చేస్తోంది. దీంతోపాటు తాజాగా చేసిన సిటాడెల్ రీమేక్ సిరీస్ హనీబన్నీ ఏడోతేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మరో వెబ్ సిరీస్ ను ఒప్పుకున్నట్లు సమాచారం. హనీబన్నీకి ఫ్యామిలీమ్యాన్ డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సిరీస్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

సమంత-వరుణ్ ధావన్ కు సంబంధించిన బోల్డ్ వీడియో తీవ్రంగా వైరలవుతోంది. వీరిద్దరూ లిప్ లాక్ ఇచ్చుకుంటున్న సన్నివేశం సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఈ తరహాలో చేయడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. శృంగారానికి సంబంధించిన సన్నివేశాల్లో సమంత నటిస్తున్న తీరును చూస్తుంటే ఆమెకు ఎవరిపైనో కోపం ఉన్నట్లుగా అర్థమవుతోందని, ఆ కోపాన్ని, ఆ కసిని ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఉపయోగించుకుంటోందంటున్నారు.

Varun Dhawan - Samantha bold video of Honey bunny web series is going viral

ఫ్యామిలీమ్యాన్ సిరీస్ లో కూడా సమంత సెమీ న్యూడ్ గా నటించింది. అప్పటినుంచే నాగచైతన్య-సమంత మధ్య వివాదం ప్రారంభమైందని, అందమైన సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం సమంతకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. తన వృత్తిలో భాగంగా ఇటువంటి సన్నివేశాల్లో నటించడం తప్పనిసరి అని, వాటిని తప్పుపట్టడం సరికాదంటున్నారు. అయితే అటువంటి సన్నివేశాలు ఇబ్బంది పెడతాయని తెలిసినప్పుడు ఎంతో మంది హీరోయిన్లు చాలా సినిమాల నుంచి తప్పుకున్నారని, అలా కాకుండా వాటిని ప్రోత్సహించే విధంగా నటించడం అనేది సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. వెబ్ సిరీస్ లో ఎలా నటించినా చెల్లబాటు అవుతుందనుకుంటున్నారని, వీటిని నియంత్రించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+