వరుణ్ తేజ్ - లావణ్య కొడుకు పేరు ఇదే..!
దసరా పండుగ సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి అభిమానులకు శుభవార్త తెలియజేశారు. ఈ మేరకు తమ కుమారుడి పేరుని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. బాబుకి 'వాయువ్ తేజ్ కొణిదెల'గా పేరు పెట్టినట్లు దంపతులు వెల్లడించారు. సోషల్ మీడియాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, వాయువ్ తేజ్ ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశారు. అయితే ఎక్కడా పిల్లాడి ముఖం కనపడనీయలేదు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు, మెగా ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఈ జంటకు విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
ఈ మేరకు ఆ పోస్టులో "ఆంజనేయ స్వామి దయతో పుట్టిన మా బాబుకి వాయువ్ తేజ్ కొణిదెల అని పేరు పెట్టాం..మీ అందరి దీవెనలు కావాలి' అంటూ ఓ చిన్న వీడియో కూడా షేర్ చేశారు. కాగా మెగా ఫ్యామిలీకి ఆంజనేయ స్వామి ఇష్ట దైవం అని తెలిసిందే. అందుకే వారి కుటుంబంలోని పిల్లలకు ఆంజనేయ స్వామి పేరు వచ్చేలా చూసుకుంటారు. దాంతో ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ వరుణ్ తేజ్ కూడా అలా పేరు పెట్టినట్టు భావిస్తున్నారు.

'అందాల రాక్షసి' సినిమాతో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా పరిచియమైంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. ''మిస్టర్'', ''అంతరిక్షం'' సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా వెళ్లింది. 2023 నవంబర్ 1న ఇటలీలో వివాహం చేసుకున్నారు. వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే హారర్ కామెడీ మూవీ రూపొందుతోంది. చాలా రోజులుగా ఓ మంచి హిట్ మూవీ కోసం వరుణ్ తేజ్ ఎదురు చూస్తున్నాడు. మరి దీంతోనైన హిట్ కొడతాడేమో చూడాలి మరి. ఈ సినిమాపై టాలీవుడ్ లో అంచనాలు బాగానే ఉన్నాయి.
-
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
సమంత "వావ్" వీడియో వైరల్..!









Click it and Unblock the Notifications