మెగా హీరోకు ఇది నిజంగా ఘోర అవమానమే..!
మెగా ఫ్యామిలీలో అరడజను మంది హీరోలు ఉన్నారు. వారిలో వరుణ్ తేజ్ కూడా ఒకరు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడుగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ, వరుణ్ తేజ్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. 2014లో 'ముకుంద'తో హీరోగా పరిచయమై, ఆ వెంటనే యుద్ధ నేపథ్యం ఉన్న 'కంచె'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా'తో లవర్ బాయ్‌గా, 'తొలి ప్రేమ'తో రొమాంటిక్ హీరోగా భారీ విజయాన్ని సాధించారు. 'F2' , 'F3' వంటి మల్టీస్టారర్ కామెడీల్లో తనదైన మార్కు చూపారు. 'గద్దలకొండ గణేష్'లో మాస్ పాత్రను పోషించి వైవిధ్యాన్ని నిరూపించుకున్నారు. 'అంతరిక్షం', 'ఘని' వంటి ప్రయోగాత్మక చిత్రాలతో వైవిధ్యమైన కథలను ఎంచుకునే హీరోగా గుర్తింపు పొందారు. అయితే గత కొంత కాలంగా వరుణ్ తేజ్ నుంచి ఆశించిన స్టాయిలో సినిమాలు రావడం లేదు.

వరుస ఫ్లాపులతో వరుణ్ తేజ్ సతమతం అవుతున్నారు. వరుణ్ తేజ్ నటించిన మూడు సినిమాలు గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయి. కెరీర్ పరంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, ఫ్యామిలీ పరంగా వరుణ్ తేజ్ శుభవార్తలనే అందించారు. వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే వారి ఇంట వారసుడు కూడా పుట్టాడు.
ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ తీవ్ర ట్రోలింగ్ గురువుతున్నారు. వరుణ్ తేజ్ తాజాగా షేర్ చేసిన ఫొటోకు నెటిజన్ల నుంచి ఊహించని స్పందన వచ్చింది. ఒక నెటిజన్ వరుణ్‌ను ఉద్దేశిస్తూ, "అన్న హీరోగా ట్రై చేస్తే బాగుండు" అని కామెంట్ చేయగా, మరొకరు "అన్నయ్య హీరో అయితే బాగుండు" అని స్పందించారు.ఇంకో నెటిజన్ మరింత ముందుకు వెళ్లి, "హీరోగా ట్రై చేయి, మంచి భవిష్యత్తు ఉంది" అని సలహా ఇచ్చాడు. "మట్కా-2 ఎప్పుడు?" అంటూ ఒక అభిమాని ఆయన తదుపరి సినిమా గురించి సరదాగా అడిగాడు. ఇలా నెటిజన్లు వరుణ్ తేజ్ లుక్‌పై తమదైనశైలిలో కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications