‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ రివ్యూ.. బొమ్మ బ్లాక్ బ్లాస్టర్

మెగా హీరోల్లో వరుణ్ తేజ్ కూడా ఒకరు. కెరీర్ స్టార్టింగ్‌లో విభిన్నమైన సినిమాలు చేస్తూ వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ముకుందా, ఫిదా, తొలిప్రేమ, కంచె వంటి సినిమాలతో అభిమానులను ఆకట్టుకున్నాడు. అయితే లోఫర్, గద్దలకొండ గణేష్ , అంతరిక్షం, గాండీవధారి అర్జున వంటి ప్లాపులతో వరుణ్ తేజ్ ఒక్కసారిగా రేసులో వెనుకపడ్డాడు. ఇండస్ట్రీలో నిలవాల్సిన తరుణంలో 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకువచ్చాడు. శుక్రవారం ధియోటర్లలో సందడి చేసిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుందో లేదో సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆపరేషన్ వాలెంటైన్ కథ విషయానికి వస్తే... అర్జున్ (వరుణ్ తేజ్) భారత వైమానిక దళంలో కమాండర్‌గా పనిచేస్తూ ఉంటాడు. అర్జున్ ఒక రూత్ లెస్ వింగ్ కమాండర్. అర్జున్ (వరుణ్ తేజ్) అత్యంత దేశభక్తి కలిగిన అధికారి. ఈ క్రమంలో ఆయన కొన్ని సాహసోపేత ఆపరేషన్స్ చేస్తాడు. పుల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోతారు.

Varun tej operation valentine review and rating

దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత నేవీ సర్జికల్ స్ట్రైక్స్ చేయాలి అనుకుంటుంది. ఈ ఆపరేషన్‌కి హెడ్‌గా అర్జున్ (వరుణ్ తేజ్) ఉంటాడు. మరి ఈ ఘటనలో అర్జున్ (వరుణ్ తేజ్) టీమ్ ఎలా విజయవంతం అయింది...? దాడి అనంతరం జరిగిన పరిణామాలు ఏమిటీ? అనేది అసలు కథ. ఆపరేషన్ వాలెంటైన్‌ను యాక్షన్ మూవీగా తెరకెక్కించాడు దర్శకుడు.

Varun tej operation valentine review and rating

యాక్షన్ సినిమాను ఇష్టపడేవారికి ఈ సినిమా ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ఆకాశంలో జరిగే యుద్ధ విమానాల విన్యాసాలు అబ్బురపరుస్తాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే కొన్ని సన్నివేశాలు ఉత్కంఠను రేపుతాయి. ఇక నటీనటుల ఫర్మామెన్స్‌కు వచ్చే సరికి కమాండర్ పాత్రలో వరుణ్ తేజ్ మెప్పించాడనే చెప్పాలి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ వైవిధ్యంతో కూడిన నటన కనబరిచారు.

Varun tej operation valentine review and rating

సినిమా కథకు తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. హీరోయిన్‌గా మానుషి చిల్లర్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇక ఈ సినిమాలో నవదీప్ ..రుహానీ శర్మ కీలకపాత్రలో కనిపించారు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ముఖ్యంగా బీజీఎం సినిమాను మరో ఎత్తుకు తీసుకువెళ్లింది.

సాహసోపేతమైన కథను ఎంచుకుని దాన్ని అద్భుతంగా తెరకెక్కించడంతో దర్శకుడు శక్తి ప్రతాప్ విజయవంతం అయ్యారనే చెప్పాలి. మొత్తానికి వార్ డ్రామాలు ఇష్టపడేవారికి 'ఆపరేషన్ వాలెంటైన్' బాగా కనెక్ట్ అవుతుంది. అయితే ఈ సినిమా సాధారణ ప్రేక్షకులకు ఎలా రీచ్ అవుతుందో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+