తెలుగు సినీ చరిత్రలో సంచలన రికార్డు నెలకొల్పిన ''సంక్రాంతికి వస్తున్నాం''

తెలుగు సినీ చరిత్రలో విజయాల శాతం ఎక్కువగా ఉన్న ఏకైక హీరో విక్టరీ వెంకటేష్. అందుకే ఆయన పేరుకు ముందు విక్టరీ అనే బిరుదును తగిలించారు. దాన్ని సార్థకం చేస్తూ తెలుగు సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరూ నెలకొల్పని సంచలన రికార్డును వెంకీమామ నెలకొల్పారు. జనవరి 14వ తేదీన సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక తెలుగు భాషలోనే రూ.300 కోట్లు కొల్లగొట్టి ఎవరూ అందుకోని రికార్డును అందుకుంది. ఈ సినిమాను మరే ఇతర భాషల్లోను విడుదల చేయలేదు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు. కేవలం తెలుగు ప్రేక్షకుల కోసం, తెలుగులోనే విడుదలైన ఈ సినిమాకు సినీ ప్రియులంతా బ్రహ్మరథం పడుతున్నారు.

నేల విడిచి సాము వద్దు
ఈ సినిమా వసూళ్లు ఆగేలా లేవు. ఇప్పటికీ బాగా వస్తున్నాయి. శుక్ర, శని, ఆదివారాలు వస్తే థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేస్తున్నారు. భార్యాభర్తల మధ్య అలకలు, చిర్రుబుర్రులు, కుటుంబంలో ఉన్న ఆనందం, ప్రేమ, అసూయ, కోపంలాంటివన్నీ వెండితెరపై చూసేందుకు అందరూ ఆసక్తిని కనపరుస్తున్నారు. కుటుంబ కథతోపాటు హాస్యాన్ని జోడించడం బాగా కలిసివచ్చింది. ఇప్పటివరకు మన నిర్మాతలు, హీరోలు, దర్శకులు యాక్షన్ థ్రిల్లర్లు, పాన్ ఇండియా ఎలివేషన్లంటూ నేల విడిచి సాము చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి వారంతా నేర్చుకోవాల్సి ఉంది. వారికి ఇది గుణపాఠం లాంటిదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

venkatesh movie sankranthiki vasthunnam create new record with 300 crore rupee collection in telugu film industry

పాటలు ముందుగానే వెళ్లిపోయాయి
కేవలం కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా సినిమా తీస్తే చాలు.. దాన్ని ఎవరూ ఊహించనిరీతిలో విజయాన్ని కట్టబెడతామని ప్రేక్షకులు ఈ సినిమాతో సినీ పరిశ్రమకు హామీ ఇచ్చారు. వెంకీమామ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, బులిరాజు, సర్వదమన్ బెనర్జీ, రాజేంద్రప్రసాద్, నరేష్, వీటీవీ గణేష్, పృథ్వీరాజ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి అద్భుతగా 72 రోజుల్లోనే తెరకెక్కించారు. కేవలం ఐదు నిముషాల నిడివి మాత్రమే ఎడిటింగ్ లో తీసేశారంటే అతని ప్రణాళిక సూపర్ అని చెప్పొచ్చు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ప్రేక్షకుల్లోకి బాగా చొచ్చుకెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+