బాలకృష్ణ షోలో వెంకీ మామ రచ్చ
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ కొత్త సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్ షో , నాలుగో సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది.ఆహా ఓటీటీలో మొదటి మూడు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. బాలకృష్ణ హోస్టింగ్ స్టైల్, మాటలు జనాలకు విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ ఏ ముహూర్తానా అన్‌స్టాపబుల్ మొదలుపెట్టారో కానీ, ఆయనకున్న క్రేజ్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది.

స్టార్ హీరోలకు సాధ్యం కాని విధంగా ఈ షోను ముందుకు నడిపిస్తున్నారాయన. ఇంకా చెప్పాలంటే ఆయన్ను వ్యతిరేకించే వారు కూడా ఈ షో చూసిన తర్వాత బాలయ్యపై తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇక నాలుగో సీజన్‌లో ,ఏపీ సీఎం చంద్రబాబు, అల్లు అర్జున్, దుల్కార్ సల్మాన్, సూర్య , నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ శ్రీలీల ఈ షోలో సందడి చేశారు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సైతం బాలకృష్ణ షోలో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.

తాజాగా వెంకటేష్‌కు సంబంధించిన ఎపిసోడ్‌ను బాలకృష్ణ పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మొదటిసారి వెంకటేష్ అన్‌స్టాపబుల్ షోలో సందడి చేయనుండటంతో అభిమానుల్లో ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని అతృతుగా ఎదురు చూస్తున్నారు. వెంకటేష్ పాల్గొనే రాబోయే ఎపిసోడ్ డిసెంబర్ 22న ప్రసారం కానుంది.












Click it and Unblock the Notifications