డబ్బుల విషయంలో వెంకటేష్ ఎంత పర్‌ఫెక్ట్‌గా ఉంటాడో చిరంజీవికి అనుభవమైంది!

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. కుటుంబ కథాచిత్రంగా, హాస్యం జోడించి విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఇప్పటికీ బ్రహ్మరథం పడుతున్నారు. అయినప్పటికీ సినిమా యూనిట్ మాత్రం ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. ఇప్పటికీ ప్రమోషన్స్ జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్లు స్టడీగా కొనసాగుతున్నాయి. సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్ సినిమాలను వెనక్కి నెట్టి పండగ విజేతగా వెంకీమామ నిలిచాడు.

ఇప్పటికే రూ.130 కోట్ల షేర్ వచ్చింది
తెలుగులో సీనియర్ హీరోలు నలుగురున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. వీరిలో వెంకటేష్ కు విజయాల శాతం చాలా ఎక్కువ. 25 సంవత్సరాల క్రితం కలిసుందాం రా సినిమాతో రూ.25 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు రూ.250 కోట్ల గ్రాస్ కొట్టగొట్టాడు. 2023లో సంక్రాంతికి విడుదలైన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య రూ.140 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూ.236 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు కేవలం రూ.50 కోట్లతో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.250 కోట్లు కొల్లగొట్టింది. రూ.130 కోట్ల షేర్ వసూలు చేసి రూ.80 కోట్ల లాభాలిచ్చింది.

venkatesh sankranthiki vasthunnam movie break the waltair veerayya gross collection record

రూ.300 కోట్ల దిశగా పరుగులు తీస్తున్నాం
సంక్రాంతికి వస్తున్నా సినిమాకు భారీ లాభాలు వస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్స్ ఆపడంలేదు. ఏపీ, తెలంగాణలో సంచలన విజయం సాధించి రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటికీ చిరంజీవి వాల్తేరు వీరయ్య రికార్డును బద్ధలు కొట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అతి త్వరలోనే అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురం రికార్డును బద్ధలు కొట్టబోతోంది. ఈ సినిమా రూ.163 కోట్ల షేర్ వసూలు చేసింది. దీన్ని బద్దలు కొట్టడం కూడా ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కిన ఒక సినిమా ఈ స్థాయి కలెక్షన్లు సాధిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. స్టార్ హీరోలు, అగ్ర హీరోల కలెక్షన్ల రికార్డులన్నీ బద్ధలవుతున్నాయి. భవిష్యత్తులో ఈ సినిమా ఇంకెన్ని వసూళ్లు రాబడుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+