వెంకటేష్ కు కాబోయే అల్లుడు ఎవరంటే..?

విక్టరీ వెంకటేష్ అంటే కేవలం తన అభిమానులకే కాకుండా సాధారణ సినిమా ప్రేక్షకులకి కూడా ఎంతో అభిమానం ఉంటుంది. 36 సంవత్సరాల నుంచి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించడంతోపాటు తన నటనద్వారా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో వెంకీ గా కొలువు తీరారు. సినీ ప్రేమికులు తమకు ఇష్టమైన హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకుంటుంటారు. కానీ ఒక్క వెంకటేష్ కుటుంబానికి సంబంధించిన వివరాలు మాత్రం బయటకు వెల్లడికావు. కుటుంబం విషయంలో ఎటువంటి ప్రచారం లేకుండా అంతటి లో ప్రొఫైల్ ను ఆయన నిర్వహిస్తుంటారు.

వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో 2019లో జైపూర్‌లో పెళ్లిని ఘనంగా జరిపించారు. ప్రస్తుతం ఆ దంపతులు స్పెయిన్‌లో నివసిస్తున్నారు. తాజాగా వెంకీ రెండో కూతురు హయవాహన కూడా పెళ్లికూతురు కాబోతోంది. విజయవాడ కి చెందిన ఒక డాక్టర్ కొడుకుతో నిన్న నిశ్చితార్థం జరిగింది. కేవలం బంధుమిత్రులను మాత్రమే ఆహ్వానించడంతో పూర్తి వివరాలు బయటకు వెల్లడికాలేదు.

venkatesh second daughter hayavahini engagement

వెంకటేష్ మూడో కుమార్తె భావన, కొడుకు అర్జున్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అర్జున్ ను తన వారసుడిగా సినిమాల్లోకి తీసుకువస్తారా? లేదంటే వ్యాపారవేత్తను చేస్తారా? అనే విషయంపై ఆ కుటుంబం స్పష్టత ఇవ్వలేదు. దగ్గుబాటి సురేష్ బాబు రెండో తనయుడు అభిరామ్ వివాహం కూడా త్వరలోనే జరగబోతోంది. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కావల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+