చిరంజీవి మనవరాలి జాతకం చెప్పిన వేణుస్వామి
మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో వారసురాలు అడుగుపెట్టారు. రామ్ చరణ్ - ఉపాసన దంపతుల కుమార్తె క్లీంకార 2023 జూన్ 20వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 1.49 గంటలకు జన్మించింది. మంగళవారం కావడంతో లక్ష్మీదేవే సాక్షాత్తూ తమ ఇంట్లోకి అడుగు పెట్టినట్లుగా చిరంజీవి-సురేఖ దంపతులు పొంగిపోయారు. అయితే వారికి చిన్న లోటు కూడా ఏర్పడింది. వారసుడు కూడా కావాలని.
సెలబ్రిటీల జాతకాలు చెప్పి తాను కూడా ఒక సెలబ్రిటీ అయిన వేణుస్వామి క్లీంకార జాతకాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. ఆ పాప జాతకానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈయన చెబుతున్నదాని ప్రకారం పాప మంచి జాతకంలో జన్మించింది. చిరంజీవిని మించిన జాతకురాలవుతుంది. ఈ పాపవల్ల చిరంజీవి-సురేఖ, రామ్ చరణ్-ఉపాసన దంపతులకు బాగా కలిసివస్తుంది. ఉపాసన జాతకం అమ్మవారి జాతకం కావడంతో రామ్ చరణ్ ది రాములవారిజాతకం.. క్లీంకారది అమ్మవారి జాతకమవుతుందని చెప్పారు.

భవిష్యత్తులో మంచి రంగంలో ఈ పాప సెటిల్ అవుతుందని, చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన కంటే మంచిన స్థాయికి వెళుతుందని, కుటుంబానికి గౌరవాన్ని తెచ్చిపెడుతుందని తెలియజేశారు. అయితే ఈ పాప జాతకం ప్రకారం చూస్తే ఆమెకు సోదరి కానీ, సోదరుడుకానీ ఉన్నట్లు కనిపించడంలేదని వేణుస్వామి తేల్చారు. అంటే రామ్ చరణ్ కు రెండో సంతానం లేదని, ఈ అమ్మాయి ఒకటే ఏకైక సంతానం అవుతుందంటున్నారు. చిరంజీవి తన కొడుకుతో కలిసి డ్యాన్స్ వేసినప్పుడు పొందిన ఆనందాన్ని రామ్ చరణ్ కూడా పొందాలని, ఆ ఆనందాన్ని నిజం చేయాలంటూ భగవంతుణ్ని కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications