నన్ను గెలికినందుకే వాళ్లకు ఈ గతి..వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన గతంలో చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో.. వేణు స్వామిని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోయింది. సమంత, నాగచైతన్యలు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని .. మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం సృష్టించారు.

రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్,ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అవుతాయని ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన. దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. సెలబ్రిటీలు సైతం ఆయనతో పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఆయన పలువురు రాజకీయ నాయకుల జాతకాలు గురించి కూడా చెప్పడం జరిగింది.

venu Swamy comments on the Telugu film industry

చంద్రబాబు, కవితలు అరెస్ట్ అవుతారంటూ వేణు స్వామి ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే వీరిద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఆయన ఎన్నికల్లో విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌లు సీఎం అవుతారని చెప్పిన వేణు స్వామి జాతకం తప్పని తేలాయి. దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు. ఇక ఇదే సమయంలో ప్రముఖ వార్త ఛానెల్‌కు సంబంధించిన ప్రతినిధితో ఆయన పెట్టుకున్న గొడవలు తారస్థాయికి చేరడంతో వేణు స్వామి సైలెంట్ అయ్యారు.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నన్ను గెలిగినందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ గతి పట్టిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ గింగిరాలు తిరుగుతుందని నేను ఓ ఇంటర్వ్యూలో చెప్పా అని అన్నారు. ఒక పెద్ద హీరోకి సంబంధించి కన్వెన్షన్‌ను కూలగొట్టడం, దేశానికి పేరు తెచ్చిన డైరెక్టర్‌ను టార్చర్ పెట్టడం, ఒక పాన్ ఇండియా హీరోని ఒకరోజు జైల్లో పెట్టడం, సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవలు ఇలా నాలుగు పెద్ద ఇన్సిడెంట్లు ఈ ఏడాది ఇండస్ట్రీలో జరిగాయి. గతంలో ఇన్ని సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఇవన్నీ జరుగుతాయని నేను ముందే చెప్పా. ఇంకా చాలా జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+