బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్న వేణుస్వామి... ఇందులో వాస్తవమెంతా..?
తెలుగు బుల్లితెర షోలలో బిగ్‌బాస్ ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. బిగ్‌బాస్ 7 సక్సెస్ క్రమంలో బిగ్‌బాస్ 8ను ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభించేందుకు స్టార్‌మా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సీజన్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా కొందరు బుల్లితెర స్టార్స్‌తో పాటు సోషల్ మీడియా స్టార్స్ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే, ఇప్పడు ఈ జాబితాలో మరో కొత్త పేరు నెట్టింట తెగ హాల్చల్ చేస్తోంది. అదేవరో కాదు ఆస్ట్రాలజర్ వేణుస్వామి. సినిమా స్టార్స్ జాతకాలు చెబుతూ సోషల్‌మీడియాలో తెగ ఫేమస్ అయ్యారు వేణుస్వామి. ప్రస్తుతం ఈయన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లోకి అడుగుపెట్టబోతున్నట్లుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే, ఇందుకోసం వేణుస్వామి భారీ పారితోషకాన్ని అందుకుంటున్నట్లు కూడా తెగ వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు.
వేణుస్వామి సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు, క్రీడాకారుల జాతకాలు చెబుతూ నెట్టంట తెగ ఫేమస్ అయ్యారు. అయితే, ఈయన చెప్పిన జాతకాలు చాలాసార్లు తలకిందులైన విషయం తెలిసిందే. టాలీవుడ్ మాజీ కపుల్ నాగచైతన్య, సమంత విడాకులతో పాటు మరికొందరు సినీ ప్రముఖులకు సంబంధించి వేణు స్వామి చెప్పిన జాతకాలు మాత్రం నిజమయ్యాయి. కానీ, ఇటీవల ఆయన చెప్పిన కొన్ని జాతకాలు మాత్రం నిజం కాలేదు. అందులో ముఖ్యంగా ఏపీ ఎన్నికల ఫలితాలు ఒకటైతే, ఐఎపీఎల్ ఫలితాలు మరొకటి.. ఇలా జాతకాలు చెబుతూ ఇటు మీడియాలోనూ అటు నెట్టింట వేణుస్వామి ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉన్నారు. అయితే, ఇప్పడు ఈయనను బిగ్‌బాస్ ఆఫర్ వరించనట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ సీజన్ 8లో సభ్యుడిగా వేణుస్వామి ఖరారయినట్లు అందుకోసం భారీ రెమ్యూనరేషన్‌ను కూడా అడిగినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్.

బుల్లితెర స్టార్స్ ఎందరో..
ఇక, వీరితో పాటు ఈ సారి బిగ్‌బాస్ హోస్‌లో మరికొందరు బుల్లితెర స్టార్స్ సందడి చేయనున్నారు. రీతూ చౌదరి, యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహా, బర్రెలక్క, కుమారి ఆంటీ, ఖుషిత, విరూపాక్ష ఫేమ్ సోనియా సింగ్, కమెడియన్ బంచిక్‌బబ్లూ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. యూట్యూబ్ స్టార్ నేత్రతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్‌బాస్ 8లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. జబర్ధస్థ్ షో నుంచి పొట్టి నరేష్, రియాజ్, కిరాక్ ఆర్‌పీ, బుల్లెట్ భాస్కర్‌లలో ఒకరు లేదా ఇద్దరు ఉండబోతున్నట్లు సమాచారం. ఏదిఏమైనా ఈ వార్తలో వాస్తవమెంతో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications