తమిళ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత: సీఎం విజయ్ సంతాపం: విషాదంలో కోలీవుడ్

తమిళ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూశారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. ఆయనకు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారం తెలియగానే తమిళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమిళనాడు గవర్నర్ రవీంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి విజయ్ సంతాపం తెలిపారు.

చెన్నై మైలాపూర్‌లో జన్మించారు దేవా. ప్రారంభంలో తన సోదరులతో కలిసి వివిధ సంగీత కచేరీలు నిర్వహిస్తూ గుర్తింపు పొందారు. 1986లో మాట్టుక్కార మన్నన్.. అనే సినిమాతో సంగీత దర్శకుడిగా వెండితెర ప్రయాణాన్ని ఆరంభించారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 400కు పైగా సినిమాలకు అద్భుతమైన స్వరాలను సమకూర్చారు. అభిమానులు ఆయనను 'తేనిసై తెండ్రల్' అని పిలుచుకుంటారు.

Veteran Tamil Music Composer Deva Passes Away in Chennai After Sudden Health Complications

ఆయన కుమారుడు శ్రీకాంత్ దేవా సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందాడు. సోదరుడి కుమారుడు జై కథానాయకుడిగా రాణిస్తున్నాడు. 1990 దశకంలో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దిగ్గజాల హవా నడుస్తున్నప్పటికీ.. దేవా తనదైన శైలి పాటలతో ప్రత్యేక గుర్తింపును నిలుపుకొంటూ వచ్చారు. ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన ఇందు మూవీ దేవా సంగీత ప్రస్థానంలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలోని పాటలన్నీ అప్పట్లో తమిళనాడును ఓ ఊపు ఊపాయి. గ్రామీణ ఉత్సవాలు, కాలేజీ ఫంక్షన్లల్లో ఆ సినిమాలోని పాటలే వినిపించేవి.

ఏపీ మీదుగా చర్లపల్లి నుంచి తమిళనాడుకు ప్రత్యేక రైళ్లు: హాల్ట్ స్టేషన్లు
ఏపీ మీదుగా చర్లపల్లి నుంచి తమిళనాడుకు ప్రత్యేక రైళ్లు: హాల్ట్ స్టేషన్లు

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల్లో టైటిల్ కార్డ్ సంగీతాన్ని సమకూర్చింది దేవానే. ప్రారంభం నుంచి నిన్నటి జైలర్ 2 వరకూ అదే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గల టైటిల్ కార్డ్ ను వాడుతున్నారు దర్శకులు. నాటి హీరోలో రజినీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ నుండి నేటి తరం నటులు విజయ్, అజిత్ వరకు అందరి చిత్రాలకు ఆయన హిట్ ట్రాక్‌లను అందించారు. గానా పాటల సంస్కృతిని ప్రధాన స్రవంతి సినిమాల్లోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది.

భాషా, అన్నామలై చిత్రాలకు ఆయన అందించిన పాటలు, ఉర్రూతలూగించే నేపథ్య సంగీతం భారతీయ సినీ చరిత్రలోనే ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. విజయ్, అజిత్ వంటి ఈ తరం అగ్ర కథానాయకుల ప్రారంభ కెరీర్‌లో దేవా స్వరపరిచిన పాటలు ఎంతో ప్రధానమైన పాత్ర పోషించాయి. ఆశై, కాదల్ కోట్టై, నాట్టమై, నేరుక్కు నేర్.. వంటి అనేక చిత్రాలు ఆయన సంగీత పరిణతికి అద్దం పడతాయి. బాషా లోని రా రా రామయ్య, ఆశైలోని కొంజ నాళ్ పొరు తలైవా వంటి పాటలు ఆ కాలంలో ఉర్రూతలూగించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+