వాళ్లు అలా అనేసరికి నా భార్య చాలా బాధపడింది - విక్టరీ వెంకటేష్

తెలుగు చిత్రపరిశ్రమలో దగ్గుబాటి కుటుంబానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు ఉంది. దివంగత దిగ్గజ నిర్మాత డి.రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తూ.. దశాబ్దాల కెరీర్‌లో ఫ్యామిలీ హీరోగా "విక్టరీ వెంకటేష్" ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇప్పటికీ స్టార్ స్టేటస్‌తో వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. గత ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా భారీ విజయాన్ని సాధించింది.

అదే జోష్ లో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి అదరగొట్టారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. కలెక్షన్ల పరంగా కూడా సినిమా రోజురోజుకీ కొత్త రికార్డులు నమోదు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ విజయం నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

victory-venkatesh-emotional-comments-about-his-wife-got-viral

ఈ సందర్భం గానే విక్టరీ వెంకటేష్ తనదైన సరదా స్టైల్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కాగా సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో తనను అభిమానులు 'వెంకి గౌడ' అంటూ పిలవడంపై స్పందిస్తూ.. అందరూ నన్ను వెంకి గౌడ అని పిలుస్తున్నారు. కానీ ఒకసారి ఎవరో మా ఆవిడను 'నీరజ గౌడ' అని పిలిచారట. పాపం ఆమెకు చాలా ఎంబారసింగ్‌గా అనిపించి బాగా ఫీలయ్యింది" అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు.

మొత్తానికి రెండు తరాల స్టార్ ఇమేజ్, నిజమైన స్నేహం, స్క్రీన్‌పై కనిపించిన అద్భుతమైన కెమిస్ట్రీ వల్ల 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా కేవలం బాక్సాఫీస్ హిట్‌గా మాత్రమే కాకుండా, ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. చిరంజీవి-వెంకటేష్‌ల కలయిక భవిష్యత్తులో మరోసారి రిపీట్ అయితే చూడాలని అభిమానులు ఇప్పటినుంచే ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి "ఆదర్శ కుటుంబం Ak47(Adarsha Kutumbam)" అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సమ్మర్ లోనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించాడు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. దాంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+