సినిమాల్లోకి వెంకటేష్ కొడుకు?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా పేరు సంపాదించుకున్నారు విక్టరీ వెంకటేష్. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా మారడమేకాదు.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. వెంకటేష్ నుంచి సినిమా వస్తుందంటే దానికి మినిమం గ్యారంటీ ఉంటుందనేది సినీ పరిశ్రమలో టాక్. అలా విక్టరీనే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. అందాల నటుడు శోభన్ బాబు తర్వాత అంతటిపేరును వెంకటేష్ సంపాదించుకున్నారు.
అందరు హీరోల కొడుకులు పరిశ్రమలోకి వస్తున్నాడు. వెంకటేష్ కుమారుడు అర్జున్ రామ్ నాథ్ ఎప్పుడు సినీ ఇండస్ట్రీలోకి రానున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే వెంకీ మాత్రం తన కొడుకు పరిశ్రమకు కాస్తంత దూరంగానే పెంచుతున్నారు. అర్జున్ కు సంబంధించిన ఏ విషయాన్ని కూడా బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడుతున్నాడు. కుటుంబ సభ్యులతో మినహా అభిమానులతోకానీ, ప్రేక్షకులతోకానీ పంచుకోవడంలేదు. పరిశ్రమలోకి కొడుకును తీసుకువచ్చే ఆలోచన ఉందా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

అయితే మరో మూడు లేదంటే నాలుగు సంవత్సరాల్లో అర్జున్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ కొడుకుతోపాటు పవన్ కల్యాణ్ కొడుకు, మహేష్ బాబు కొడుకుతోపాటు బాలకృష్ణ కొడుకు కూడా ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తారు. అయితే వీరిలో ఎవరు స్టార్ హీరోలవుతారు అనేది చూడాలి. ఎందుకంటే వారి తండ్రుల వారసత్వాన్ని నిలపాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. అలాగే వారికి కాస్తంత అదృష్టం కూడా తోడవ్వాలి. దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్నవారంతా కెరీర్ ప్రారంభంలో శరవేగంగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం మాత్రం ఏడాదికో, లేదంటే రెండేళ్లకో ఓ సినిమా చేస్తున్నారు. వీరంతా ఇలాగే సినిమాలు చేసుకుంటూ వస్తే వీరిని కూడా ప్రేక్షకులు మర్చిపోయే అవకాశం ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications