విజయ్ దేవరకొండ వదులుకున్న క్లాసిక్ లవ్ స్టోరీ ఏదంటే..?
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన 'కింగ్‌డమ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా, పవర్‌ఫుల్ ఎమోషన్స్‌తో సాగుతుందని టాక్. 'జెర్సీ' వంటి న్యాచురల్ క్లాసిక్ హిట్ అందించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయ్ గత చిత్రాలు 'లైగర్', 'ఖుషి' ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
అలానే హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా.. సత్యదేవ్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ఆయన సౌండ్‌ట్రాక్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు హిందీ వెర్షన్‌కు "Saamraajya" అనే టైటిల్ పెట్టారు. OTT హక్కులను Netflix సుమారు రూ.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

విజయ్ వదిలేసిన సినిమా ఏది అంటే..?
రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మళ్లీ రావా'లో మొదట హీరోగా అనుకున్నది అక్కినేని సుమంత్ కాదు, విజయ్ దేవరకొండే అని గౌతమ్ తిన్ననూరి లేటెస్ట్ ప్రమోషన్లలో వెల్లడించారు. 'పెళ్లి చూపులు' రిలీజ్ రోజున 'మళ్లీ రావా' కథను విజయ్‌కి చెప్పాను. కానీ ఆయన అది నచ్చలేదని, సమోసాలు తిన్న తర్వాత "ఈ సినిమా వద్దులే" అని చెప్పి వెళ్లిపోయాడు' అని గౌతమ్ తెలిపాడు.
2017లో విడుదలైన 'మళ్లీ రావా' సినిమా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. అక్కినేని సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమా అప్పట్లో క్లీన్ లవ్ స్టోరీగా సూపర్ హిట్ సాధించింది. వరుస ఫ్లాప్స్ తో ఉన్న సుమంత్‌కి ఈ సినిమా మళ్లీ హిట్ ఇచ్చింది.

దాంతో అప్పుడు సెట్ కాలేని విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత రాబోతోందని అంటున్నారు. ఈ మూవీ విజయ్ కెరీర్‌లో మరోసారి 'అర్జున్ రెడ్డి' తరహా పెద్ద విజయాన్ని ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో #KingdomFromJuly31 ట్రెండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications