విజయ్ దేవరకొండ సినిమా కొనుగోలుకు ముందుకు రాని సంస్థలు
లైగర్ సినిమా పరాజయం తర్వాత ఖుషి సినిమాతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది మిశ్రమ ఫలితం అందుకుంది. ఈసారిఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో విజయ్ ఉన్నాడు. పరుశురామ్ దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ పక్కన నటిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దీనికి నిర్మాత దిల్ రాజు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ వీడియో సంచలనం సృష్టించింది. ఐరనే వంచాలా ఏంటి? అనే డైలాగ్ ఫేమస్ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులోకి దిగింది.
సంక్రాంతి రేసు నుంచి ఈ సినిమా తప్పుకునే అవకాశాలున్నాయంటున్నారు. ఇంతవరకు ఫ్యామిలీ స్టార్ డిజిటల్ హక్కులు కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. వాస్తవానికి నిర్మాతలకు థియేట్రికల్ హక్కులకన్నా డిజిటల్ హక్కులకే ఎక్కువ డిమాండ్ ఉంటోంది. జనాలు కూడా ఓటీటీలకు అలవాటుపడ్డారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ పోటీలుపడి నిర్మాతలకు పెద్దమొత్తంలో చెల్లిస్తూ సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి. అయితే భారీమొత్తం వెచ్చించి కొన్ని సినిమాలు చాలావరకు ఫ్లాప్ అయ్యాయి. సంస్థలకు నష్టం వాటిల్లింది. దీంతో ఆచితూచి సినిమాను కొనుగోలు చేస్తున్నారు. గతంలో పెట్టినంత ధర కూడా పెట్టడంలేదు.

సంక్రాంతికే విడుదల కాబోతున్న గుంటూరు కారం సినిమాను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. వెంకటేష్ సైంధవ్ సినిమాను అమెజాన్ కొనేసింది. దీంతో అదే సమయానికి విడుదలవుతున్న ఫ్యామిలీస్టార్ ను కొనుగోలు చేయడానికి ఈ రెండు సంస్థలు ముందుకు రావడంలేదు. ఒకవేళ కొనుగోలు చేస్తే ఎక్కువ గ్యాప్ లేకుండా స్ట్రీమింగ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల నష్టమేకానీ లాభం లేదు. దీంతో నిర్మాత దిల్ రాజు కూడా సందిగ్ధంలో పడ్డాడు.












Click it and Unblock the Notifications