'గర్ల్‌ఫ్రెండ్‌తో సమయం గడపలేకపోతున్నా'.. నిర్మొహమాటంగా చెప్పేసిన రౌడీ హీరో?
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత జీవితం గురించి అరుదుగా మాట్లాడతారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో రౌడీ హీరో చేసిన వ్యాఖ్యలు రష్మిక మంధానతో తన డేటింగ్ పుకార్లకు మళ్లీ ఊతమిచ్చాయి. తన గర్ల్‌ఫ్రెండ్‌కు తగినంత సమయం కేటాయించలేకపోతున్నానని, ఈ విషయంలో తాను పశ్చాత్తాపపడుతున్నానని విజయ్ దేవరకొండ అంగీకరించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన మధ్య కెమిస్ట్రే తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. వారిద్ధరూ తమ సంబంధాన్ని ఎప్పుడూ ధ్రువీకరించకపోయినా, సోషల్ మీడియాలో, అభిమానుల మధ్య వీరి గురించి నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ పుకార్ల మధ్యే విజయ్ దేవరకొండ మొదటిసారిగా తన బాధను బయటపెట్టారు. తనకు ఒక పశ్చాత్తాపం ఉందని, దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాని ఆయన తెలిపారు.

తన సన్నిహితులతో తగినంత సమయం గడపలేకపోతున్నానని విజయ్ దేవరకొండ ఆవేదన వ్యక్తం చేశారు. "సంబంధాలు అన్నింటికంటే ముఖ్యమైనవి. గత రెండేళ్లలో నేను ఎదిగాను. జీవితాన్ని ఎలా జీవించాలో కూడా నేర్చుకున్నాను. అంతకు ముందు నేను ఇలా లేను. గత 2-3 సంవత్సరాలలో నాకు నా జీవితం నచ్చలేదు. నేను నా అమ్మ, నాన్న, గర్ల్‌ఫ్రెండ్, స్నేహితులతో తగినంత సమయం గడపలేదు. అకస్మాత్తుగా ఒకరోజు నేను రియలైజ్ అయ్యాను. మళ్లీ అలాంటి ఫీలింగ్ నాకు ఉండకూడదు. ఇప్పుడు నేను నా వాళ్ల కోసం సమయం కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తాను. నేను నా స్నేహితులు, అమ్మానాన్నలు, గర్ల్ ఫ్రెండ్ కోసం సమయం కేటాయిస్తాను. " అని విజయ్ దేవరకొండ అన్నారు.
ఈ వ్యాఖ్యలు విజయ్ దేవరకొండ ఎవరి పేరు చెప్పకపోయినా, ఆయన రష్మిక మంధాన గురించే మాట్లాడుతున్నారని అభిమానుల్లో చర్చకు దారితీశాయి. అమ్మానాన్నలతో పాటు గర్ల్ ఫ్రెండ్‌తో సమయం గడపలేదని విజయ్ చెప్పడంతో.. ఆ ప్రేయస్ మరెవరో కాదు రష్మికనే అంటూ.. రష్మికను రౌడీ హీరో చాలా మిస్ అవుతున్నట్లు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
రష్మిక-విజయ్ దేవరకొండ సినీ ప్రస్థానం, పుకార్లు
విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన కలిసి రెండు సూపర్ హిట్ చిత్రాలలో నటించారు: 'గీత గోవిందం' (2018), 'డియర్ కామ్రేడ్' (2019). ఈ సినిమాల నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారంపై పుకార్లు మొదలయ్యాయి. అయితే వీరిద్దరూ ఈ వార్తలను ఎప్పుడూ ధ్రువీకరించలేదు లేదా ఖండించలేదు. గతం సంవత్సరం వీరిద్దరి మాల్దీవుల ట్రిప్ వీరి రిలేషన్ గురించి పుకార్లకు ఆజ్యం పోసింది. వీరిద్దరూ త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను విజయ్ దేవరకొండ ఖండించారు. తాను ప్రస్తుతం ఎంగేజ్మెంట్ లేదా పెళ్లి చేసుకోబోవడంలేదని, ఇవన్నీ కేవలం పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు.
విజయ్ దేవరకొండ భవిష్యత్ ప్రాజెక్టులు
సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ 'కింగ్‌డమ్' సినిమాపైనే పెట్టుకున్నారు. ఈ చిత్రం జులై 31న థియేటర్లలో విడుదల కానుంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాలభామ భాగ్యశ్రీ బోర్సే నటించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. జులై 28న 'కింగ్‌డమ్' ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే











Click it and Unblock the Notifications