విజయ్ దేవరకొండ చేయనంటే బొమ్మ బ్లాక్‌బస్టరే
యూత్ లో, అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానరుపై సూర్యదేవర నాగవంశీ దీన్ని రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. కొంతకాలం క్రితం ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఈ హీరో మధ్యలో కొన్ని ఫ్లాప్స్ ఇచ్చాడు. తర్వాత గీత గోవిందంతో నిలదొక్కుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఫ్లాప్స్ పలకరించాయి.
కథలను ఎంచుకోవడంలో తడబడుతున్న విజయ్
సినిమా కథలను ఎంచుకునే విషయంలో విజయ్ తడబడుతున్నాడని సినీ విశ్లేషకుల అభిప్రాయం. విజయ్ తిరస్కరించిన సినిమాలు కూడా వారి అభిప్రాయాన్ని నిజం చేస్తున్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమా విజయ్ కు వినిపిస్తే నచ్చలేదని చేయనన్నాడు. అప్పుడు ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ కు ఈ సినిమా మంచి విజయాన్ని సాధినంచి ఊరటనిచ్చింది. ఆర్ఎక్స్ 100 సినిమా కథ కూడా దర్శకుడు అజయ్ భూపతి విజయ్ కే వినిపించాడు కానీ చేయనని చెప్పాడు. రూ.2 కోట్ల తెరకెక్కి రూ.25 కోట్లు రాబట్టి సన్సేషనల్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా ఉప్పెన. ఈ అవకాశం కూడా విజయ్ కే వచ్చింది. కథ నచ్చకపోవడంతో చేయనన్నాడు. అప్పుడు వైష్ణవ్ తేజ్ ను తీసుకున్నారు. అతనికి మొదటి సినిమా ఇది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.

అది కాదని ఇది చేస్తే అట్టర్ ఫ్లాప్ అయింది
ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో హీరో తెలంగాణ యాసలో మాట్లాడాలి. విజయ్ దేవరకొండ అయితే బాగా వస్తుందని పూరీ జగన్నాథ్ ఎంతో ఎదురుచూశాడు. గీత గోవిందం షూటింగ్ లో ఉంటే కలిసి మరీ అడిగినప్పటికీ పూరీ ఫ్లాప్స్ లో ఉన్నాడని చేయనన్నాడు. చివరకు రామ్ తో చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను పూరీ సొంతం చేసుకున్నాడు. తర్వాత లైగర్ చేయడంతో ఘోరపరాజయం పాలైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా కూడా విజయ్ దేవరకొండ చేయాల్సింది. లైగర్ ప్రాజెక్టులో ఉండటంతో చేయడం కుదర్లేదు. దుల్కర్ సల్మాన్, మృణాల్ సేన్ నటించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది.












Click it and Unblock the Notifications