మెగాస్టార్ మూవీపై విజయ్ షాకింగ్ పోస్ట్.. మనవాళ్లే ఇలా చేస్తే బాధ !!

తెలుగు చిత్ర పరిశ్రమలో రివ్యూలు, రేటింగ్స్ వ్యవహారంపై ఎన్నో ఏళ్లగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ విషయం మరింత తీవ్రమవుతోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం "మన శంకర వరప్రసాద్ గారు". చిరు కెరీర్‌లో 157వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరీలియో సంగీతం సమకూరుస్తున్నారు. అలానే లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. కేథరిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

అయితే ఈ మూవీ టీం బుక్ మై షో (BookMyShow) వంటి ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్‌లలో రేటింగ్స్, రివ్యూలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుక్ మై షో ఈ సినిమాకు రేటింగ్స్ , రివ్యూలను ఇవ్వకుండా తాత్కాలికంగా నిలిపివేసింది న్యాయస్థానం. ఈ విషయం పైనే యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ విషయం తనకు సంతోషాన్నిచ్చినప్పటికీ.. కొంత బాధను కూడా కలిగిస్తోందని ఎమోషనల్ ట్వీట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

vijay-devarakonda-shocking-post-on-megastar-chiranjeevi-movie

ఆ పోస్టులో..

ఫేక్ రేటింగ్స్, రివ్యూలకు చెక్ పెట్టడం ఎంతోమంది కష్టాన్ని, కలలను కాపాడుతుందని విజయ్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే, మన సొంత మనుషులే ఇతరుల ఎదుగుదలను అడ్డుకునేలా ఇటువంటి సమస్యలు సృష్టించడం బాధాకరమని అన్నారు. 'మనం బతుకుతూ ఇతరులను బతికించాలి' అనే సూత్రం నేడు మృగ్యమైపోతోందని ఆయన ఆవేదన చెందారు.

అలానే తనపై ఇటువంటి దాడులు 'డియర్ కామ్రేడ్' సినిమా నుంచే మొదలయ్యాయని, అప్పట్లో తాను మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదని విజయ్ గుర్తు చేసుకున్నారు. తన కలలను, భవిష్యత్తులో వచ్చే వారి ఆశయాలను కాపాడుకోవడానికి ఈ కుట్రదారులతో ఎలా వ్యవహరించాలో తెలియక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఎమోషనల్ అయ్యారు. ఇన్నాళ్లకు ఈ విషయం బహిరంగంగా చర్చకు రావడంపై ఆయన సంతోషించారు.

ఇక మెగాస్టార్ వంటి పెద్ద హీరోల సినిమాలకు కూడా ఇటువంటి ముప్పు ఉందని కోర్టు గుర్తించడం శుభపరిణామమని విజయ్ పేర్కొన్నారు. ఇది సమస్యకు పూర్తి పరిష్కారం కాకపోయినా, కొంతవరకు ఊరటనిస్తుందని భావించారు. ఈ సంక్రాంతికి వస్తున్న 'మన శంకరవరప్రసాద్' (చిరంజీవి) గారి సినిమాతో పాటు అన్ని చిత్రాలు ఘనవిజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+