హీరోయిన్‌తో హోటల్‌లో ఆ పని చేస్తూ దొరికిపోయిన విజయ్ దేవరకొండ
గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. రష్మిక మందాన-విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' 'సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' సినిమాతో మరోసారి మ్యాజిక్ చేయాలని చూసినప్పటికి అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందాన కెమిస్ట్రీ మాత్రం అదిరింది. ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి సినిమాల్లో కనిపించలేదు కానీ..తెర బయట మాత్రం ఆ జంట కనువిందు చేస్తూనే ఉన్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక ఒకరి తర్వాత మరొకరు కనిపించడడం .. ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక ,విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడంతో.. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే అభిప్రాయనికి వచ్చేశారు.

ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదని విజయ్ దేవరకొండ , రష్మిక క్లారిటీ ఇస్తునే ఉన్నారు. అయినప్పటికీ వీరిపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ , రష్మిక ఇద్దరూ వేర్వేరుగా ఒకే ఇంట్లో ఉన్న ఫొటోలను తమ సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు. విజయ్ దేవరకొండ ఫొటో దిగిన బ్యాక్‌గ్రౌండ్‌లోనే .. రష్మిక కూడా ఫొటో దిగింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిట్టగోడ రెండూ సేమ్ టు సేమ్. దీంతో వీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు నిర్ధారించుకున్నారు.
Vijay Devarakonda & Rashmika Mandanna pic.twitter.com/R499vonGjQ
— Telugu Chitraalu (@TeluguChitraalu) November 23, 2024
తాజాగా మరోసారి ఈ జంట ఒకే చోట దర్శనం ఇచ్చారు. రష్మిక, విజయ్ ఓ రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ కనిపించారు. దీంతో మరోసారి వీరిద్దరి రిలేషన్‌షిప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి దీనిపై ఈ హాట్ పెయిర్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications