అలిగిన స్వీటీని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ దీర్ఘకాల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ కిందటి నెల 26 ఒక్కటయ్యారు. ఉదయపూర్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి పీటలు ఎక్కారు. ఈ జంట సాంప్రదాయ తెలుగు, కొడవ ఆచారాల ప్రకారం వివాహం చేసుకుంది. దీని తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సహా దాదాపుగా సినీ పరిశ్రమ మొత్తం తరలివచ్చిందీ ఫంక్షన్ కు. అనంతరం తమ స్వగ్రామంలో వత్రం నిర్వహించారు. ఊరందరికీ భోజనాలు వడ్డించారు.
లిటిల్ ఫ్యాన్ ఒకరు ఈ ఫంక్షన్లకు అటెండ్ కాలేకపోయారు. ఉదయ్ పూర్ లో పెళ్ళికి తనను ఎందుకు ఆహ్వానించలేదని ఆ చిన్నారి నేరుగా విజయ్ దేవరకొండను అడిగారు. 'నేను మీ అభిమానిని కాదా? మా సంగతి ఏమిటి?' అని అమాయకంగా ప్రశ్నిస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ఇది వైరల్ అయింది. యువర్స్ లక్కీతల్లి అనే ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారా చిన్నారి. దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వేలసంఖ్యలో కామెంట్స్ పోస్ట్ అయ్యాయి. రిప్లైలు పడ్డాయి.

ఈ వీడియోకు విజయ్ దేవరకొండ సానుకూలంగా స్పందించారు. వెంటనే రిప్లై ఇచ్చారు. 'బుజ్జితల్లి.. ఇంటికి పిలుస్తా లంచ్ కి. నీ ఫేవరెట్ ఫుడ్ అండ్ స్వీట్స్ నాకు చెప్పు, అన్నీ ఇంట్లో చెప్పించి మంచిగా తిందాము' అని బదులిచ్చారు. రష్మిక మందన్న కూడా ఈ క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రీపోస్ట్ చేశారు. ఇంట్లో ప్రత్యేకంగా ఈ చిన్నారి కోసం ఇష్టమైన ఫుడ్ చేసిపెడతామని సరదాగా కామెంట్స్ పోస్ట్ చేశారు. ఈ జంట స్నేహపూర్వకంగా రియాక్ట్ కావడం ప్రశంసలు అందుకుంది.
విజయ్ దేవరకొండ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ.. రణబాలి. రష్మిక మందన ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ లో నటిస్తోన్నారు. త్వరలో రణబాలి ఫిల్మ్ షూటింగ్ లో రీజాయిన్ కానున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి కెమెరా ముందుకు రాబోతోండటం ఇదే తొలిసారి. పెళ్లి ఏర్పాట్ల నేపథ్యంలో దాదాపుగా నెల రోజుల గ్యాప్ తర్వాత వీరి షెడ్యూల్ రెజ్యూమ్ కాబోతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి షూటింగ్ పునః ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
పెళ్లి తర్వాత నెల రోజుల పాటు షూటింగ్ ల నుంచి విరామం తీసుకోవాలని మొదట్లో భావించినప్పటికీ.. అది వాస్తవ రూపం దాల్చట్లేదు. చేతిలో ఉన్న రణబాలి మూవీని కంప్లీట్ చేయాలని నవ దంపతులిద్దరూ నిర్ణయించారనేది ఫిల్మ్ నగర్ టాక్. రణబాలి తదుపరి షూటింగ్ షెడ్యూల్ ఈ నెల 12న ప్రారంభించనున్నారని తెలుస్తోంది. వివాహం తర్వాత వారిద్దరూ కలిసి నటిస్తోన్న తొలి సినిమా ఇదే కావటం వల్ల క్రేజ్ ఏర్పడింది.
-
గద్దర్ అవార్డుల్లో గీతా ఆర్ట్స్ హవా.. ఆయన మంత్రాంగం పనిచేసిందా? -
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !! -
Varanasi ఊచకోత.. కేవలం ఓవర్సీస్లో రైట్స్‌కే అన్ని రూ.కోట్లా? -
మరో కొత్త కాన్సెప్ట్..? గ్యాప్ ఇవ్వు అన్న కాస్తా..! -
నా కథను మానభంగం చేసేశారు..! -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
"ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" -
తప్పేం చేయలేదు.. తిరుమలలో కేక్ కటింగ్ వివాదంపై దివ్వెల మాధురి షాకింగ్ స్పందన! -
ఇంటెన్స్ కోర్టు డ్రామాతో మెంటలెక్కించేశారుగా..! -
ఒకటి ఫుల్ క్లాస్.. ఇంకోటి ఊర మాస్.. ఫుల్ జోష్ లో యంగ్ హీరో !! -
ఆ హీరోని చూస్తే సింహాన్ని చూసినట్టే - కోర్టు బ్యూటీ శ్రీదేవి











Click it and Unblock the Notifications