హోటల్‌లో ఆ హీరోయిన్‌తో దొరికిపోయిన విజయ్ దేవరకొండ
గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. రష్మిక మందాన-విజయ్ దేవరకొండ గీత గోవిందం మూవీలో మొదటిసారి కలిసి నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేయాలని చూసినప్పటికి అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన కెమిస్ట్రీ మాత్రం అదిరింది. ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు.
ఆ తరువాత వీరిద్దరు కలిసి సినిమాల్లో కనిపింలేదు కానీ..తెర బయట మాత్రం ఆ జంట కనువిందు చేస్తూనే ఉన్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక ఒకరి తరువాత మరొకరు కనిపించడడం .. ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక ,విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడంతో.. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే అభిప్రాయనికి వచ్చేశారు. ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదనివిజయ్ దేవరకొండ , రష్మిక క్లారిటీ ఇస్తునే ఉన్నారు. అయినప్పటికీ వీరిపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి.

విజయ్ దేవరకొండ , రష్మిక ఇద్దరూ వేర్వేరుగా ఒకే ఇంట్లో ఉంటున్న ఫొటోలను తమ సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు. విజయ్ దేవరకొండ ఒక ఫోటో దిగిన బ్యాక్‌గ్రౌండ్‌లోనే .. రష్మిక కూడా ఫొటో దిగింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిట్టగోడ రెండూ సేమ్ టు సేమ్. దీంతో వీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు నిర్ధారించుకున్నారు. ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి ఫొటోనే మరొకటి పోస్ట్ చేశారు ఈ జంట. తాజాగా ఈ జంట అబుదాబికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజు.
#VijayDeverakonda #RashmikaMandanna pic.twitter.com/IBjBfK3tIv
— hi bro (@Hi_broo_______) April 4, 2024
ఆమె తన బర్త్ డేను అబుదాబిలో జరుపుకోనున్నట్లు తెలిపింది. అంతేకాదు ఓ నెమలి ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వెంటనే విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో రాబోయే తన సినిమా ఫ్యామిలీ స్టార్ గురించి ఫ్యాన్స్‌తో మాట్లాడాడు. అయితే ఆ వీడియోలో బ్యాగ్రౌండ్‌లో ఓ నెమలి కనిపించింది. దీంతో విజయ్ దేవరకొండ , రష్మిక ఒకే హోటల్‌లోనే ఉన్నట్లు నెటిజన్స్ నిర్దారణకు వచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే వీరు తమ రిలేషన్‌పై ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications