"నేను సింగిల్ కాదు"
రౌడీ హీరో విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేసి.. గీతా గోవిందంతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు దూసుకొచ్చారు. అయితే గీతా గోవిందం సినిమాలో విజయ్, రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇద్దరూ అప్ కమింగ్ యాక్టర్స్ కావడంతో పోటీపడి మరీ నటించారు. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పాటు వీళ్లకూ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత డియర్ కామ్రెడ్ చిత్రం ద్వారా మరోసారి ఈ జోడీ మెరిసింది. ఈ మూవీ ఆశించినంత విజయం కాకపోయినా విజయ్, రష్మిక కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై వర్క్ అవుట్ అయింది.
ఇక విజయ్, రష్మిక డేటింగ్ లో ఉన్నారంటూ చాలాసార్లు వార్తలు వచ్చాయి. కానీ విజయ్ కానీ రష్మిక కానీ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. చాలాసార్లు వీళ్లిద్దరూ కెమెరాలకు చిక్కారు. కానీ ఎప్పుడూ వారి మధ్య ఉన్న రిలేషన్ పై మాత్రం స్పందించలేదు. అయితే వీళ్లు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా విజయ్ దేవరకొండ.. తాను సింగిల్ కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నా వయసు 35. కచ్చితంగా నేను సింగిల్ కాదు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో విజయ్, రష్మికల మధ్య రిలేషన్ పై రూమర్స్ మరింత బలపడ్డాయి. అయితే విజయ్ మాత్రం రష్మిక పేరును ప్రస్తావించకుండా, పర్సనల్ విషయాల్లో ప్రైవసీకి విలువ ఇస్తానని తెలిపారు. ఈ విషయంపై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. కానివండ్రా.. కానివ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం విజయ్ కింగ్ డమ్ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈనెల 31 న మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇటీవల పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇటీవల పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక సినిమాను ఈ నెల 31న రిలీజ్ చేయనున్నారు.












Click it and Unblock the Notifications