ఎన్టీఆర్ కోసం మూవీ టైటిల్ మార్చుకున్నాం.. ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. జులై 31 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించింది. సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. విజయ్ యాక్షన్, అనిరుధ్ మ్యూజిక్, మూవీ సెటప్ ఇవన్నీ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్లు ఆడియన్స్ నుంచి టాక్ వినిపిస్తోంది. దీంతో చాలా ఏళ్ల తర్వాత కొండన్నకు హిట్ పడిందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ కీలక విషయాలు వెల్లడించారు.
తాము కింగ్డమ్ సినిమాకు ముందుగా దేవర నాయక అనే టైటిల్ అనుకున్నామని. కానీ అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవర మూవీ రావడంతో టైటిల్ ను కింగ్ డమ్ గా మార్చామని తెలిపారు. అలా కింగ్డమ్ సినిమా టీజర్ కు ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వడం.. టీజర్ హిట్ కావడం సినిమాకు ప్లస్ అయిందని చెప్పుకొచ్చారు. ఇక మూవీ సెకండ్ పార్ట్ అద్భుతంగా ఉంటుందని విజయ్ తెలిపారు. రెండో పార్ట్ లో స్టార్ హీరో నటిస్తారని వివరించారు. ఇక ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ మూవీలో చేస్తున్నట్లు తెలిపారు. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ కాగా.. మరొకటి రవి కిరణ్ కోలాతో కలిసి చేస్తున్నట్లు చెప్పారు.

ఇక కింగ్డమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురిపిస్తోంది. ఫస్ట్ డే థియేటర్లలో విడుదలైన కింగ్డమ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 39 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.












Click it and Unblock the Notifications