'కింగ్‌డమ్' రివ్యూ : బొమ్మ దద్దరిల్లిపోయింది ..!

విజయ్ దేవరకొండ "కింగ్‌డమ్" సినిమాతో తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, ఒక పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా, విజయ్ దేవరకొండ అభిమానులకు, మాస్ ఆడియన్స్‌కు ఒక పండగే అని చెప్పడంలో సందేహం లేదు.

కథ
"కింగ్‌డమ్ " ఒక సాధారణ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా మొదలై, అన్నదమ్ముల బంధం చుట్టూ అల్లబడిన బలమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఒక దీవిలో గ్యాంగ్‌స్టర్‌గా మారిన తన అన్నయ్య (సత్యదేవ్)ను కాపాడటానికి, ఓ కానిస్టేబుల్ (విజయ్ దేవరకొండ) స్పైగా మారడం, అక్కడి క్రూరమైన తెగలకు నాయకుడిగా ఎదగడం ఈ సినిమా ప్రధాన కథాంశం. కథనం కొత్తది కాకపోయినా, గౌతమ్ తిన్ననూరి తన మార్క్ టేకింగ్, బిగి సడలని స్క్రీన్‌ప్లేతో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించాడు. ముఖ్యంగా, భావోద్వేగ సన్నివేశాలను చక్కగా డీల్ చేసి ప్రేక్షకులను కదిలించాడు.

Vijay Deverakonda s Kingdom movie review

ఫర్మామెన్స్
"కింగ్‌డమ్"లో విజయ్ దేవరకొండ 'సూరి' పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచాడు. చాలా కాలం తర్వాత తనలోని మాస్ యాక్షన్ హీరోను పూర్తిగా బయటపెట్టాడు. జైలు సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లలో విజయ్ పెర్ఫార్మెన్స్ హైలైట్. 'అనకొండలా తిరిగొచ్చాడు' అంటూ నెటిజన్లు అతడి నటనను ప్రశంసిస్తున్నారు. ఎమోషనల్ సీన్స్‌లోనూ విజయ్ తనదైన మార్క్ చూపించి, పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సత్యదేవ్ తన అన్న పాత్రలో ఒదిగిపోయి, విజయ్‌తో కలిసి అన్నదమ్ముల సెంటిమెంట్‌ను పండించాడు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే కూడా తన పాత్రలో చక్కగా నటించి, రొమాంటిక్ ట్రాక్‌ను ఆకట్టుకునేలా చేసింది.

సాంకేతిక విభాగం పనితీరు
ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమాకు ప్రాణం పోసింది. ప్రతి సన్నివేశాన్ని అనిరుధ్ తన సంగీతంతో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. అతని BGM లేకుండా ఈ సినిమాను ఊహించలేం అన్నంతగా అనిరుధ్ ప్రభావితం చేశాడు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా, గ్రాండ్‌గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు అద్భుతం. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన మార్క్ స్టోరీటెల్లింగ్‌తో, ఎమోషన్స్‌ను, యాక్షన్‌ను సరైన నిష్పత్తిలో హ్యాండిల్ చేశాడు. కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించినా, ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా చేశాడు.

విశ్లేషణ
సినిమా మొదటి భాగం గ్రిప్పింగ్‌గా సాగుతుంది. పాత్రల పరిచయం, కథలోకి వెళ్ళే విధానం ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. ద్వితీయార్థంలో కథనం కాస్త నెమ్మదించినా, భావోద్వేగాలతో నిండిన సన్నివేశాలు, ముఖ్యంగా విజయ్ పాత్ర పరివర్తన, రాజుగా మారే సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్ సాలిడ్‌గా ఉండి, రెండవ భాగానికి బలమైన లీడ్ ఇస్తుంది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, అవి సినిమాటిక్ అనుభవానికి పెద్దగా అడ్డు చెప్పవు.

ప్లస్ పాయింట్స్:

విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్

అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే నేపథ్య సంగీతం

అద్భుతమైన సినిమాటోగ్రఫీ, విజువల్స్

బలమైన అన్నదమ్ముల సెంటిమెంట్

మాస్ యాక్షన్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:

ద్వితీయార్థంలో కొన్ని చోట్ల నెమ్మదించిన కథనం

సాధారణ కథా నేపథ్యం

ఫైనల్
"కింగ్‌డమ్" విజయ్ దేవరకొండ అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు పండగలాంటి సినిమా. అద్భుతమైన నటన, అదిరిపోయే సంగీతం, భారీ విజువల్స్‌తో ఈ చిత్రం ఒక పక్కా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. కొన్ని చిన్న లోపాలున్నా, సినిమా ఓవరాల్‌గా ఆకట్టుకుంటుంది. చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ ఒక పక్కా హిట్ కొట్టాడని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+