థియేటర్‌లో పెళ్లి చేసుకున్న విజయ్ అభిమానులు..
మనదేశంలో అతిపెద్ద ఎంటర్‌టైన్ మెంట్ సినిమానే. సినీ నటులకు కూడా మనదేశంలో అంతే అదరణ ఉంది. ఒక్కో నటుడికి అభిమానులు, అభిమానసంఘాలు అన్నీ ఇక్కడే సాధ్యం. ఏ అభిమాని అయినా తన స్టార్ సినిమా రీలిజయిన ఫస్ట్ రోజు ఫస్ట్ షో చూడాలని తపిస్తాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యే రోజు రాత్రి నుంచే థియేటర్ల దగ్గర పడిగాపులు కాస్తుంటాడు. ఫస్ట్ రోజు సినిమా చూడగానే ఆ అభిమానికొక ఆనందం. అయితే, తాజాగా విజయ్ అభిమానులు థియేటర్లో చేసిన పని ఇప్పడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
నేడు దళపతి విజయ్ చిత్రం లియో రిలీజై థియేటర్లలో సందడి చేస్తుంది. ఫెవరేట్ హీరో సినిమా మొదటిరోజు ఎవరైనా చూస్తారు. కానీ ఓ అభిమాని మాత్రం కాస్త కొత్తగా ఆలోచించాడు. లియో థియేటర్లో ఏకంగా తన కాబోయే భార్యను తీసుకొచ్చి దండలు మార్చుకున్నారు. ఉంగరాలు ధరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

థియేటర్‌లో దండలు మార్చుకున్నారు..
ఈ జంట తమిళనాడులోని పుదుకుట్టే జిల్లాకు చెందినవారు. వెంకటేష్, మంజుష అనే వీరికి దళపతి విజయ్ అంటే ఎంతో ఇష్టం. అయితే వీరిద్దరూ ఈ ఏడాది ప్రారంభంలోనే తమ నిశ్చితార్థాన్ని పూర్తిచేసుకున్నారు. పెళ్లి మాత్రం లియో రిలీజ్‌లోనే చేసుకోవాలని అనుకున్నారు. దానికోసం గత ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తున్నారు. అయితే, పెద్దలు వీరి పెళ్లి ముహుర్తం అక్టోబర్ 20న ఫిక్స్ చేయగా, వారు మాత్రం తన ఫెవరేట్ హీరో విజయ్ లియో సినిమా రిలీజ్‌న అంటే నేడు అక్టోబర్ 19న థియేటర్‌లో పెళ్లిచేసుకుని అందరికి షాక్ ఇచ్చారు.
In #Pudukkottai a couple exchanged their engagement ring and put Maalai on each other in front of #Leo in the morning show. @xpresstn #VijayThalapathy #VijayFans #LeoMovie #wedding pic.twitter.com/OsZMrh7iYm
— Iniya Nandan (@Iniyanandan25) October 19, 2023
రేపు జరగాల్సిన పెళ్లి తంతు కాస్త ఇవాళే పూర్తిచేశారు ఈ జంట. వీరిద్దరూ సాంప్రదాయ దుస్తుల్లోనే థియేటర్‌కు వచ్చారు. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలోనే థియేటర్‌లోని దండలు మార్చుకుని, ఉంగరాలు తొడుక్కున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి లియో సినిమా వీక్షించారు. ఈ పెళ్లి తతంగాన్ని మొత్తం కుటుంబసభ్యులు, స్నేహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా ఇప్పడు వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు ఈ వీడియో చూసి అభిమానుల అంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications