తమ్ముడి సినిమాకి నో... అన్న సినిమాకు ఓకే చెప్పిన రాములమ్మ.. కారణమేంటో తెలుసా..!
రాములమ్మ అని పేరు చెప్పగానే అందరికీ విజయశాంతే గుర్తుకొస్తుంది. ఎందుకంటే రాములమ్మ సినిమాతో ఇప్పటికి తెలుగు ప్రేక్షకులు మనసులో చెరగని ముద్రగా నిలిచిపోయింది విజయశాంతి. ఆ సినిమాలో ఆమె నటించిన పాత్ర, ఆమె నటన ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా ఉండేలా చేసింది.
చాలా యేళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రంతో టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చింది విజయశాంతి. అయితే ఇప్పటికీ ఆమెకు ఎన్ని ఆఫర్లు వచ్చినా వాటిని రిజెక్టు చేస్తూనే ఉందంటా. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆమెను ఒప్పించేందుకు అనిల్ రావిపూడి ఎంతో కష్టపడ్డట్టు తెలుస్తోంది. అయితే విజయశాంతి తాజాగా మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు మీడియా వర్గాల్లో వినిపిస్తోంది.

సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ...
ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఆమెకు రీసెంట్‌గా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర చిత్రంలో నటించాలంటూ రిక్వెస్టు వెళ్లిందట. అయితే, ఆ సినిమాలో విజయశాంతిది తల్లిపాత్ర అని.. తల్లి పాత్ర చేయను అని విజయశాంతి ఎన్‌టిఆర్ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమాకు నో చెప్పగానే ఇక, విజయశాంతి సినిమాలకు దూరంగా ఉంటారేమోనని చాలామంది అనుకున్నారు.
కానీ, ఈ మధ్యే తెలిసిన విషయం ఏమింటే, విజయశాంతి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మళ్లీ మేకప్ వేసుకునేందుకు రాములమ్మ సిద్ధం అవుతున్నారు. అయితే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిత్రం కళ్యాణ్‌రామ్‌ది. అందులో కళ్యాణ్‌రామ్ లీడ్ రోల్ చేయబోతున్నారు. అయితే, తమ్ముడు ఎన్‌టిఆర్ సినిమాకి నో చెప్పిన విజయశాంతి.. కళ్యాణ్ రామ్ సినిమాకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది..
ఎన్‌టిఆర్ సినిమా రిజెక్ట్ చేసి.. కళ్యాణ్ రామ్ సినిమాకు ఓకే...
అయితే, తల్లి పాత్రలు చేయనని ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పిందట విజయశాంతి. అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాకంటే ముందు ఆమెతో రాజా ది గ్రేట్ సినిమాలో రాధిక చేసిన తల్లి పాత్రని చేయించాలని విశ్వ ప్రయత్నం చేశాడట. కాని విజయశాంతి మాత్రం అస్సలు ఒప్పుకోలేదట.
అయితే, కల్యాణ్ రామ్ హీరోగా అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల పై ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి సిద్దమయ్యారు. ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. కళ్యాణ్ రామ్ 21వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో విజయశాంతి నటిస్తుండడం విశేషం.. అయితే, ఈసినిమాతో ప్రేక్షకులను రాములమ్మ ఎలా మెప్పిస్తారో చూడాల్సిందే..












Click it and Unblock the Notifications