ఒకేరోజు రెండు సార్లు పెళ్లి చేసుకోనున్న విజయ్- రష్మిక.. ఎందుకంటే..?
టాలీవుడ్ జంట విజయ్- రష్మిక ఎట్టకేలకు తమ వివాహాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. వీరి వివాహం ఫిబ్రవరి 26 న ఉదయ్ పూర్ లో ఘనంగా జరుగబోతోంది. ఇదే విషయాన్ని అధికారికంగా తమ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్స్ ద్వారా తెలిపారు. అయితే వీరు తెలుగు, కర్ణాటక(కొడువ) సంప్రదాయాల్లో రెండుసార్లు వివాహం చేసుకోనున్నారు. ఉదయం తెలుగు పద్ధతిలో వివాహం, సాయంత్రం కొడువ సంప్రదాయంలో వేడుక జరగనుంది. అనంతరం మార్చి 3న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఊహాగానాలు, వార్తలను తెరదించుతూ టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరి వివాహం ఫిబ్రవరి 26 న ఉదయ్ పూర్ లో ఘనంగా జరుగబోతోంది. ఇక ఇటీవల తమ ఇన్ స్టా ఖాతాల్లో తమ పెళ్లి వేడుకకు ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టినట్టు అధికారికంగా ఇద్దరూ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఎల్లుండి వివాహం నేపథ్యంలో తాజాగా విజయ్, రష్మిక ఉదయ్ పూర్ కు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. వీరితోపాటు విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు. దీంతో అనేక మంది నెటిజన్లు, సెలబ్రిటీలు, అభిమానులు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విరోష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే విజయ్- రష్మిక జంట ఒకేరోజు రెండు పెళ్లిళ్లు చేసుకోనున్నట్లు సమాచారం. వీరు తెలుగు, కర్ణాటక(కొడువ) సంప్రదాయాల్లో రెండుసార్లు వివాహం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి సంగీత్ సెరమొనీ, రేపు ఉదయం హల్దీ కార్యక్రమం.. అలాగే రేపు రాత్రి మెహందీ వేడుక జరగనుంది. అలాగే ఫిబ్రవరి 26 న ఉదయం తెలుగు స్టైల్ వివాహం చేసుకుంటారు. అలాగే అదేరోజు సాయంత్రం కొడువ స్టైల్ లో వివాహం జరగనుంది. ఇక ఈ జంట శుక్రవారం రోజు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.

ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారి 2018లో గీత గోవిందం చిత్రంలో నటించారు. ఈ మూవీలో ఈ జంట తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దాంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పట్లో ఈ జంట షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2019 లో డియర్ కామ్రేడ్ చిత్రంలో వీరిద్దరూ నటించారు. ఆ మూవీ సమయంలోనే వీరి బంధం బలపడిందని.. విజయ్- రష్మిక డేట్ లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి.












Click it and Unblock the Notifications