"మోనాలిసా" వచ్చేస్తుందోచ్.. హీరోయిన్‌గా టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ !
అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అవ్వడం అనే ఉదాహరణను కూడా ఇందుకు ఉపయోగిస్తాం. కొందరికి ఎంత కష్టపడ్డా ఫలితం దక్కదు.. మరికొందరికి మాత్రం తెలియకుండానే లక్కీ ఛాన్స్ వచ్చేస్తుంది. ఈ తరహా ఘటనలకు ఉదాహరణ అంటే మోనాలిసా భోంస్లే అని చెప్పాలి. ఈ ఏడాది జరిగిన మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు, పూసలు అమ్ముతూ కనిపించి అందరినీ ఆకర్షించింది. ఆమె సహజమైన అందం, చిరునవ్వుకు అంతా ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
ఎవరి మోనాలిసా..
మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్‌కు చెందిన అమ్మాయి మోనాలిసా. కాగా తన కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా కుంభమేళాకు వచ్చి రుద్రాక్ష మాలలు, పూసలు అమ్మడం ప్రారంభించింది. అయితే ఆమె ఫోటోలు వైరల్ కావడం.. ఆమెను చూసినవారు సెల్ఫీల కోసం క్యూ కట్టడం.. మీడియా సైతం ఆమెపై ఫోకస్ పెట్టడంతో టాక్ ఆఫ్ ది తో గా మారిపోయింది. ఆ క్రమంలోనే బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆ వీడియోలను చూసి ఆమెకి సినిమా ఛాన్స్ ఇచ్చారు.

ఆ తర్వాత మోనాలిసా 'ది డైరీ ఆఫ్ మణిపూర్' అనే బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకుంది. దాంతో మోనాలిసా క్రేజ్ నార్త్‌లోనే కాకుండా సౌత్‌లోనూ బలంగా పెరిగిపోయింది. ఆ తర్వాత షాప్ ఓపెనింగ్‌లు చేస్తూ బిజీ బిజీగా మారిన ఈ అమ్మడు.. ఈసారి ఏకంగా పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ తెలుగు ప్రేక్షకులను సైతం అలరించనుంది.
లైఫ్ మూవీ..
మోనాలిసా హీరోయిన్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో "లైఫ్" అనే సినిమా ప్రారంభోత్సవం అయ్యింది. ఈ చిత్రానికి శ్రీను కోటపాటి దర్శకత్వం వహించనుండగా.. చరణ్ సాయి హీరోగా నటిస్తున్నాడు. చరణ్ గతంలో క్రష్, ఇట్స్ ఓకే గురు సినిమాల్లో హీరోగా చేశారు. ఈ సినిమాని శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్ మీద అంజయ్య విరిగినేని, ఉషా విరిగినేని నిర్మిస్తున్నారు. గతంలో ఆదిసాయికుమార్‌తో 'లవ్ కే రన్', ధనరాజ్, తాగుబోతు రమేష్‌తో 'ఏకే రావు పీకే రావు' మూవీలతో శ్రీను డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
పూసలమ్ముతు ఫేమస్...మోనాలిసా తెలుగు సినిమా లాంచ్#MonalisaBhosle #Monalisa #Life #KumbhmelaMonalisa #ReelTalk #OITelugu pic.twitter.com/5Ke6KsQxN4
— oneindiatelugu (@oneindiatelugu) November 5, 2025
ఈ మేరకు సినీ జర్నలిస్ట్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత సురేష్ కొండేటి సైతం.. మోనాలిసాతో దిగిన ఫోటోల్ని సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ.. మోనాలిసా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా గ్రాండ్ లాంచ్' అని పోస్ చేశారు. ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications