కోహ్లీతో బంధంపై బాంబు పేల్చిన హీరోయిన్.. ఇంతకు మించి ఏం చెప్పలేనంటూ మ్యాటర్ లీక్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎవరూ ఊహించని విధంగా తన టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. టెస్ట్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో టీమిండియా క్రికెట్‌లో ఓ అద్భుత శకం ముగిసినట్టు అయింది. క్రికెట్‌లో కోహ్లీ ఎంత ఆగ్రసివ్‌గా ఉంటాడో తెలిసిందే. అలాగే గ్రౌండ్ వెలుపుల కోహ్లీ మంచి ప్లేబాయ్. అతను చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడనే పుకార్లు ఉన్నాయి.
కోహ్లీ డేటింగ్ చేసిన అమ్మాయిల లిస్ట్‌ను ఒకసారి పరిశీలిస్తే...బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, కోహ్లీల బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినీ-క్రీడా రంగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో విరాట్ కోహ్లీ ,అనుష్క శర్మ కూడా ఒకరు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరైతే, అనుష్క శర్మ బాలీవుడ్‌లో ప్రముఖ నటి. వీరిద్దరి కలయిక సినీ-క్రీడా ప్రేమికులను ఒకే చోట చేర్చింది. ఆ యాడ్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

కొన్నాళ్లు రిలేషన్‌లో వీరిద్దరు తర్వాత తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత, 2017లో ఇటలీలో సైలెంట్‌గా వివాహం చేసుకున్నారు. విరాట్,అనుష్క దంపతులకు కూతురు , కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉంటే కోహ్లీ గురించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కోహ్లీ మరో హీరోయిన్‌ను ఇష్టపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. అవ్‌నీత్ కౌర్.
అవ్‌నీత్ కౌర్ సోషల్ మీడియాను కోహ్లీ లైక్ కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. విరాట్ కోహ్లీ ఆమె పోస్ట్‌కు లైక్ కొట్టడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అవ్‌నీత్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీనితో వీరిద్దరి మధ్య ఏదో ఉందని నెట్టింట్లో పుకార్లు షికారు చేశాయి.
ఈ వ్యవహారంపై కోహ్లీ స్వయంగా స్పందించి, ఇన్‌స్టా ఫీడ్‌ను క్లియర్ చేస్తుండగా, పొరపాటున లైక్ బట్టన్ నొక్కానని వివరణ ఇచ్చారు. ఈ విషయం చల్లారుతోందన్న సమయంలో, తాజాగా అవ్‌నీత్ కౌర్ ఈ ఇష్యూపై మాట్లాడి, కొత్త చర్చకు తెరలేపింది.
తన తాజా చిత్రం 'లవ్ ఇన్ వియత్నాం' ప్రమోషన్స్ సందర్భంగా ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ, సామాన్యుల నుంచే కాదు, సెలబ్రిటీల నుంచి కూడా ప్రేమ లభించడం ఆనందంగా ఉంది. ప్రేమ ఎప్పుడూ దొరుకుతూనే ఉండాలి. ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేనని చెప్పుకొచ్చింది.
అవ్‌నీత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో స్పష్టంగా చెప్పడం లేదు, అసలు ఏదైనా ఉందా, లేదా అని చెబుతున్నావా? అంటూ నెటిజన్లు ఆమె వ్యాఖ్యలపై షాకింగ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ ఇష్యూతో అవ్‌నీత్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications