VIROSH: విజయ్- రష్మిక పెళ్లి.. అధికారిక ప్రకటన వచ్చేసింది..
ఎట్టకేలకు తమ వివాహాన్ని ప్రకటించారు విజయ్- రష్మిక. ఈ విషయాన్ని ఇద్దరూ తమ ఇన్ స్టా అకౌంట్ ద్వారా ప్రకటించారు. ' మేం ఏదైనా ప్లాన్ చేయడానికి ముందే మీరు(ఫ్యాన్స్) ప్రేమతో మాకు ఓ పేరు పెట్టారు. మిమ్మల్ని VIROSH అని ప్రేమగా పిలిచారు. మీ ఇష్ట ప్రకారమే మా వేడుకకు the wedding of VIROSH అని పేరు పెట్టాలనుకుంటున్నాం. మీ ప్రేమకు ధన్యవాదాలు.. అని పేర్కొన్నారు. ఈ మేరకు వీరి వివాహం ఉదయ్ పూర్ లో ఫిబ్రవరి 26 న ఘనంగా జరగనున్నట్లు సమాచారం.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. తమ వివాహంపై ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని విజయ్, రష్మిక తమ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశారు. ఫ్యాన్స్ పిలుచుకుంటున్నట్లుగానే తమ వివాహానికి VIROSH అని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్టులు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇక విజయ్- రష్మిక వివాహం ఈ నెల 26న ఉదయ్ పూర్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విజయ్- రష్మిక పెళ్లి కార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. మార్చి 4న రాత్రి 7 గంటలకు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో రిసెప్షన్ జరగనుందని అందులో పేర్కొన్నారు. ఇక వీరిద్దరూ తమ వివాహాన్ని బంధువులు, సన్నిహితుల మధ్య చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారి 2018లో గీత గోవిందం చిత్రంలో నటించారు. ఈ మూవీలో ఈ జంట తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దాంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పట్లో ఈ జంట షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2019 లో డియర్ కామ్రేడ్ చిత్రంలో వీరిద్దరూ నటించారు. ఆ మూవీ సమయంలోనే వీరి బంధం బలపడిందని.. విజయ్- రష్మిక డేట్ లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి.
-
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే












Click it and Unblock the Notifications