బిగ్‌బాస్‌కు వెళ్లినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి - విష్ణుప్రియ

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో 'బిగ్‌బాస్' మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇటీవల సీజన్ 9 ప్రారంభం అయింది. సెప్టెంబర్ 7న స్టార్ట్ కాగా.. 50 రోజులు పూర్తి చేసుకుంది. 13 మందితో హౌస్ అంతా రణరంగంగా మారింది. అన్ని సీజన్లతో పోలిస్తే.. ఇది కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈనేపథ్యంలో.. తాజాగా, మాజీ కంటెస్టెంట్ బిగ్‌బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసింది. ఈ షోకు ఎందుకు వెళ్లానా అని చెప్పుతో కొట్టుకోవాలంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

యాంకర్ విష్ణు ప్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. పోవే పోరా అనే షో ద్వారా ఆడియన్స్ కు పరిచయమైన ఈ ముద్దగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తన యాంకరింగ్, అందాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతకు ముందు టెలివిజన్‌లో వరుస షోల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

vishnu-priya-comments-on-bigg-boss-telugu-goes-viral-on-media

యూత్‌లో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది. గతంలో అందాలను ఆరబోస్తూ గ్లామర్ ఫోటోషూట్‌లతో నెట్టింట హీట్ పెంచింది. ఆ తర్వాత బిగ్ బాస్ షో లోకి కూడా ఎంట్రీ ఇచ్చి మరింత చేరువైంది. కానీ బిగ్ బాస్ షో లో పృథ్వీతో ప్రేమాయణం కొనసాగించడం అంత హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ తరహా కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.

విష్ణుప్రియ మాట్లాడుతూ.. నేను డబ్బుల కోసమే బిగ్ బాస్ షోకు వెళ్లానని తెలిపింది. కొత్త ఇల్లు కట్టుకోవచ్చని కంటెస్టెంట్ గా ఎంటరయ్యానని.. కానీ అదేమీ జరగలేదని వాపోయింది. ఇప్పటికీ పాత ఇంట్లోనే ఉంటున్నానని.. బిగ్ బాస్ హౌస్ కు వెళ్లడమనేది తాను తీసుకున్న రాంగ్ డిసిషన్ అని వెల్లడించింది. బిగ్ బాస్ నుంచి తాను ఏమి నేర్చుకోలేదని.. మళ్లీ బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చినా అసలు వెళ్లనని క్లారిటీ ఇచ్చింది.

ఒక్కసారి వెళ్లినందుకే తనను తాను తిట్టుకున్నానని.. ఎందుకు వెళ్లాను అని ఆలోచించనని స్పష్టం చేసింది. నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలని తిట్టుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా తనను అభిమానించే వారు ఉన్నారు కాబట్టే ఇలా ఉన్నానని.. బిగ్ బాస్ వల్ల కొందరు తిట్టారని ఓపెన్ అయ్యింది. ప్రస్తుతం విష్ణు ప్రియ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

vishnu-priya-comments-on-bigg-boss-telugu-goes-viral-on-media
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+