అన్నా .. ఇంకెప్పుడు ఇలాంటి సినిమాలు చేయకు ప్లీజ్..!
బాలీవుడ్ , టాలీవుడ్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారీ యాక్షన్ చిత్రం 'వార్ 2', బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో డిసాస్టర్ కలెక్షన్స్‌తో మొదటి వారాన్ని ముగించింది.
'వార్ 2' మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 204.25 కోట్ల నెట్ ( రూ.243 కోట్లు గ్రాస్) వసూలు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన షేర్ సుమారు రూ. 52.2 కోట్లుగా ఉంది. నిజానికి, ఈ సినిమా రూ. 92 కోట్ల బ్రేక్-ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అంటే, తెలుగు రాష్ట్రాల్లోనే ఇంకా దాదాపు రూ. 40 కోట్ల వరకు వసూలు చేయాలి. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, బ్రేక్-ఈవెన్ కావాలంటే సుమారు రూ.400 కోట్లకు పైగా నెట్ వసూలు చేయాల్సి ఉంటుంది.
సినిమాకు మొదటి రోజు వచ్చిన భారీ ఓపెనింగ్స్ తర్వాత, రెండో రోజు నుంచే కలెక్షన్లు వేగంగా పడిపోయాయి. తెలుగులో మొదటి రోజు రూ.22.75 కోట్లు షేర్ వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు రూ.12.5 కోట్లకు పడిపోయింది. ఆ తర్వాత కలెక్షన్లు మరింత దిగజారాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి.

11వ రోజు (ఆదివారం) నాడు కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: ఈ సినిమా 11వ రోజున (ఆదివారం) రూ.33 లక్షల షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.9.70 కోట్ల గ్రాస్ వసూలు చేసి, దాదాపు రూ.4.28 కోట్ల షేర్ రాబట్టింది. 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.42.24 కోట్ల షేర్ సాధించింది. అయితే, రూ..92 కోట్ల బ్రేక్-ఈవెన్ టార్గెట్‌ను అందుకోవాలంటే ఇంకా రూ.49.76 కోట్ల షేర్ వసూలు చేయాలి.
ఇప్పటివరకు 'వార్ 2' ప్రపంచవ్యాప్తంగా రూ.169.29 కోట్ల షేర్ (దాదాపు ₹327.90 కోట్ల గ్రాస్) సాధించింది. 'వార్ 2' సినిమా మొత్తం రూ.307 కోట్ల బ్రేక్-ఈవెన్ టార్గెట్‌తో థియేటర్లలోకి వచ్చింది. అంటే, ఇప్పటివరకు సాధించిన కలెక్షన్లు కాకుండా, సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.137.71 కోట్ల షేర్ సాధించాల్సిన అవసరం ఉంది. పని దినాల్లో సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.












Click it and Unblock the Notifications