హైపర్ ఆదిపై అనసూయ సంచలన కామెంట్స్ .. ఇద్దరి మధ్య లింక్ అంటూ దారుణంగా

అందాన్ని అనసూయను వేరుగా చూడటం కొంచెం కష్టమే. ఎందుకంటే అందానికి మారు పేరే అనసూయ. ఇక అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ..తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్‌లు కొట్టేసింది.

క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

War of words between Anasuya and Hyper Aadi

సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 40 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఏమాత్రం చెక్కు చెదరని అందం ఆమె సొంతం. ఫిజిక్ మెయిన్‌టైన్‌ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.

చీర కట్టినా , స్కర్ట్ వేసినా ,ఏం చేసినా అది అనసూయకే చెల్లింది. జబర్దస్త్‌ షోతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న అనసూయ తాజాగా ఆ షో నుంచి ఎందుకు దూరం అయిందో తెలిపింది. జబర్దస్త్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో , షో యాజమాన్యం స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్‌లో షో నుంచి బయటకు వెళ్లిన వారందరూ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనసూయ, హైపర్ ఆదిల మధ్య కొద్దిగా మాటల యుద్దం నడిచింది.

నేను నీ స్కిట్‌లకు మద్దతు ఇచ్చి, ప్రోత్సహించినప్పటికీ, నువ్వు నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. షో నుండి వెళ్లిపోయే ముందు కూడా "వద్దు వద్దు, నాకు కొన్ని నచ్చడం లేదని బతిమాలినా, ఆది వినలేదని అనసూయ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఆది రియాక్ట్ అవుతూ.. నువ్వు అమెరికా వెళ్లినా లింకులు పంపించా.. అది రా మన లింకు అంటూ అనసూయపై మరో పంచ్ డైలాగ్ విసిరాడు హైపర్ ఆది. దీంతో ఇదిగో ఇలాంటి మాటల వల్లే నేను జబర్దస్త్ వదిలి వెళ్లిపోయా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అనసూయ. అంటే హైపర్ ఆది మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తానూ జబర్దస్త్ వీడటానికి కారణం అనేసింది అనసూయ.ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+