పెళ్లిపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం సింపుల్‌గా జరిగిన సంగతి తెలిసిందే.సమంత, నాగ చైతన్య ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. సమంత ఒంటిరిగా ఉండగా, నాగ చైతన్య మాత్రం విడాకుల తర్వాత శోభిత ధూళిపాళతో నాగ చైతన్య సైలెంట్‌గా డేటింగ్ చేశాడు.

ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అతి కొద్దిమంది సమక్షంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. ఈక్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించి కీలక ఘట్టం మొదలైంది.నాగ చైతన్య -శోభిత ధూళిపాళల పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే శోభిత ధూళిపాళ నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను శోభిత ధూళిపాళ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

wedding card of Naga Chaitanya and Sobhita Dhulipala s wedding card has gone viral

ఈ ఫొటోల్లో శోభిత ధూళిపాళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా పాల్గొన్నారు. ఇక, ఇప్పుడూ అందరూ ఊహించినట్టుగానే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం ఘనంగా జరగనుందంటూ వెడ్డింగ్ పెళ్లి కార్డును అక్కినేని ఫ్యామిలీ షేర్ చేశారు. ఇక ఇప్పటివరకు వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది. అన్నపూర్ణ స్టూడియోలోనే పెద్ద సెట్ వేసి , అక్కడే వివాహం జరిపించబోతున్నట్లు తెలిసిన సమాచారం. మొత్తానికి, అక్కినేని ఇంట్లో శోభిత అడుగుపెట్టబోతోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+