అమీర్‌ఖాన్ ఇంట మొద‌లైన పెళ్లిసంద‌డి...ఫ్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ షురూ..

బాలీవుడ్ న‌టుడు అమీర్‌ఖాన్ ఇంట పెళ్లి సంద‌డి మొదలైంది. ఈ మ‌ధ్య త‌న అభిమానుల‌తో త‌న కూతురి పెళ్లి ప‌నుల గురించి ప్ర‌స్తావించిన అమీర్, ఇప్పుడు తాజాగా ఇంట్లో జ‌రుగుతున్న పెళ్లివేడుకల గురించి అప్‌డేట్ ఇచ్చారు. అమీర్ ఖాన్‌, ఆయన మాజీ భార్య రీనా దత్తాల కుమార్తె ఐరా ఖాన్. ప్రస్తుతం అమీర్‌ఖాన్ త‌న కూతురు ఐరాఖాన్ పెళ్లిప‌నుల్లో బిజీగా ఉన్నారు. అయితే, ఐరాఖాన్ ఎంతోకాలంగా నుపుర్ శిఖ‌ర్‌ను ప్రేమిస్తుంది. వీరిద్ద‌రి ఎంగెజ్‌మెంట్ కూడా 2022 నవంబర్ 18 లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎంతో కాలం నుంచి వీరిద్ద‌రూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ‌ను ఇరుకుటుంబాల వారు కూడా అంగీకారం తెలిపారు. అందుకే 2022లో ఎంతో ఘ‌నంగా నిశ్చితార్థ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. వీరిద్ద‌రూ నిశ్చితార్ధం అనంత‌రం ఫారెన్ టూర్లు.. వెకేషన్లతో పాటు.. హాట్ ఫోటోల‌తో అభిమానుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు.

జ‌న‌వ‌రిలో పెళ్లి భాజాలు మోగ‌నున్నాయి..:ఐరాఖాన్‌, నుపుర్ శిఖ‌ర్‌ల వివాహం 2024 జనవరి 13న జ‌ర‌గ‌నుంది. ఇంత‌కుముందే దీనిగురించి అమీర్‌ఖాన్ ప్ర‌స్తావించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ న‌టుడు అమీర్‌ఖాన్ ఈ పెళ్లిపై స్పందించారు. ''ఐరా జనవరి 13న వివాహం చేసుకోబోతోంది. వ‌రుడి పేరు నుపుర్. అతడో లవ్ లీ బోయ్. ఐరా మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమెకు నుపుర్ అండగా నిలిచాడు. వారు కలసి త‌మ జీవితాన్ని మొద‌లుపెడుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు.

Wedding celebrations like Aamir Khans house... Free wedding celebrations begin..

కెల్వ‌న్ వేడుక‌తో.. మొద‌లైన పెళ్లిప‌నులు..:నుపుర్ శిఖరే మహారాష్ట్రకు చెందిన అబ్బాయి. కాబ‌ట్టి వారి సంప్రదాయం ప్రకారమే ఈ పెళ్లి పనులు జరుగుతున్నాయి. పెళ్లి ప‌నుల‌ను మొద‌లుపెట్టే ముందు వీరు కెల్వ‌న్ వేడుక అనే ఒక సంప్ర‌దాయాన్ని నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మంగా అనంత‌రం వీరి ఫ్రీ వెడ్డింగ్ వేడుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. కెల్వ‌న్ వేడుక అంటే, ఇరు కుటుంబాలు పెళ్లికి ముందు సంప్రదాయ భోజ‌నం చేసేందుకు ఒక‌రినొక‌రు క‌లుసుకుంటారు. ఆ త‌ర్వాత ఒక‌రినొక‌రు పెళ్లికి ఆహ్వ‌నించ‌వ‌చ్చు. ఈ సంప్ర‌దాయం ప్ర‌కారం ఒక‌రికొక‌రు బ‌హుమ‌తులు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఈ వేడుక‌తో పెళ్లిప‌నులు మొద‌లుపెట్టేశారు ఇరుకుటుంబాల వారు. వీరి పెళ్ళికి బాలీవుడ్ నుంచి భారీగా ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు స‌మాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+