సమంత ఇలా మారిపోయింది ఏంటి?

తెలుగు చలనచిత్ర సీమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న అందాల బ్యూటీ సమంత బాలీవుడ్ లోకి కూడా అడుగు పెడుతోంది. వెబ్ సిరీస్ లద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోంది. వెబ్ సిరీస్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోయిన్ గా మొదటిస్థానంలో నిలిచింది. ఎంతోమందికి సినీరంగంలో మంచి పేరు వచ్చినప్పటికీ స్టడీగా విజయాలు సాధించలేరు. అందుకు భిన్నంగా సమంత మాత్రం కొన్ని సంవత్సరాలుగా తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

నాగచైతన్యతో వివాహం అవకముందు ఎంత పేరు తెచ్చుకుందో విడాకుల తర్వాత అంతకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంది. మయోసైటిస్ ద్వారా సినిమాలకు విరామం ప్రకటించి ప్రస్తుతం కథలను వింటోంది. త్వరలోనే ఏదో ఒక తెలుగు సినిమాద్వారా అభిమానులను పలకరించనుంది. మయోసైటిస్ రావడంద్వారా కొంత కుంగుబాటుకు గురైనప్పటికీ ప్రస్తుతం ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకొని ముందుకు పయనిస్తోంది. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు కూడా చేయాలని నిర్ణయించుకుంది.

What has changed star heroine Samantha?

సోషల్ మీడియా ఖాతాలద్వారా అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉంటుంది. తన విషయాలను తెలియజేస్తుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో సమంత ఫొటోలు వైరల్ గా మారాయి. తన అందాలను ఆరోబోయేడమేకాదు నెటిజన్లు అందాల విందును అందిస్తోంది. ఎప్పుడూ లేనివిధంగా స్లీవ్ లెస్ డ్రస్ వేసుకొని నడుము, ఎద అందాలతో ఫొటోకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు సమంత చాలా హాట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

త్వరలోనే సల్మాన్ ఖాన్ సినిమాలో నటించడంద్వారా బాలీవుడ్ లోని నేరుగా అడుగుపెడుతోంది. తనలో ఉన్న నటనా ప్రతిభను ఈ సినిమా వెలికితీస్తుందని, దేశవ్యాప్తంగా పేరొస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ఇటీవలే ప్రారంభించిన నిర్మాణ సంస్థ ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించి కొత్త రక్తాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+