మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలకు కారణం అదేనా?
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ.. ఇలా ఉంటాయి. ఈకోవలోనే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ కూడా చేరింది. మోహన్ బాబుకు మంచు విష్ణు, మనోజ్ తో పాటు లక్ష్మీ అనే కూతురు కూడా ఉంది. ఇటీవలికాలంలో మనోజ్ కు, విష్ణుకు మధ్య విభేదాలున్నాయని, సందర్భాన్ని బట్టి అవి బటయపడుతున్నాయంటున్నారు. రెండురోజుల క్రితమే మనోజ్ సోదరుల మధ్య వివాదానికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. అవి అతని సోదరుడు విష్ణు గురించే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
మంచు లక్ష్మి, మనోజ్ ఒక వైపు ఉంటారని, విష్ణు మాత్రం వేరే పార్టీ కాబట్టి వారి మధ్య విభేదాలు వచ్చినా అవి బయటకు కనిపించడంలేదంటున్నారు. అయితే ఇదంతా మోహన్ బాబు ఆధ్వర్యంలోనే జరుగుతోందని కొందరంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా మనోజ్ తన అన్నయ్య విష్ణుతో గొడవలు పడుతున్నాడని, ఇటీవల సంపూర్ణేష్ బాబు సోదరా చిత్రానికి సంబంధించిన పాటను విడుదల చేయగా, ఈ ఈవెంట్‌లో మనోజ్ తమ సోదరుల మధ్య గొడవల గురించి మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చాడు.

అన్నదమ్ముల మధ్య అనుబంధం చాలా ముఖ్యం. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య డబ్బు సమస్యలు రాకూడదని, వచ్చినా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదంటున్నారు. అయితే కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా మనోజ్ కానీ, విష్ణుకానీ ఇష్టపడంలేదు. ఆస్తి పంపకాల విషయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయంటున్నారు. వీరి సమస్యను ఎవరు పరిష్కరిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications