ఒక్కడు చాలు అంటున్న విశ్వక్ సేన్.. ఎవరు అతను.. ఏంటా స్టోరీ ?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక సేన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. 'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఆ తర్వాత ఫలక్ నామా దాస్ మూవీతో ప్రేక్షకుల్లో మంచి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత హిట్, పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం, దాస్ కా దమ్కీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సహా పలు సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగారు.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'లైలా' చిత్రం రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లైలా అనే లేడీ గెటప్‌లో కనిపించబోతుండడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌, సాంగ్స్ కి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే రీసెంట్ గా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఆ ఈవెంట్ లో 30 ఇయర్స్ పృధ్వీ పలు కీలక వ్యాఖ్యలు చేయడంతో సినిమాని బ్యాన్ చేయాలంటూ పెద్దఎత్తున ట్వీట్స్ చేశారు. ఈ సినిమా విషయంలో వివాదాలు వద్దు అని.. క్షమించాలని మీడియా ఎదిత విశ్వక సారీ కూడా చెప్పారు.

Vishwak Sen single body guard

సాధారణంగా సెలబ్రిటీలకు బాడీగార్డ్‌లు, బౌన్సర్లు ఉంటారు. పబ్లిక్‌లోకి వెళ్లినప్పుడు బౌన్సర్లు లేకుండా ఉండడం అంటే సాహసం అనే చెప్పాలి. ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ బాడీగార్డ్‌ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆరున్నర అడుగులు హైట్‌తో ఉన్న ఇతన్ని ముంబై నుంచి తీసుకొచ్చి మరీ విశ్వక్ సేన్ బాడీగార్డ్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కమెండో బాడీగార్డ్‌‌ని తనకి రక్షణగా పెట్టుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

కాగా విశ్వక్ సేన్ బాడీ గార్డ్‌ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆ బాడీ గార్డ్ పేరు రొహ్ తాస్ చౌదరి. వయసు 30. హైట్ 6.10 అడుగులు. ముంబైలో చాలామంది సెలబ్రిటీలు, పొలిటీషియన్స్‌కి పర్సనల్ సెక్యురిటీగా రొహ్ తాస్ చౌదరి పనిచేసినట్టు తెలుస్తోంది. అతని గురించి చెబుతూ.. నాకు ఎక్కువ మందిని బౌన్సర్లుగా పెట్టుకోవడం ఇష్టం ఉండదు. నా స్టాఫ్‌ కూడా ఎక్కువ ఉండటం నచ్చదు.సెక్యురిటీగా ఒక సాలిడ్ పర్సన్ ఉంటే చాలు అనుకున్నాను. ఏడాది క్రితం ముంబై‌లో చౌదరిని కలిసినట్టు వెల్లడించారు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలోనే కొంచెం ఫేమస్ అయిన సెలబ్రిటీలు సైతం ఓ తెగ హడావిడి చేస్తున్న తరుణంలో.. విశ్వక్ సేన్ మాత్రం.. ఒకే ఒక్కడు చాలంటున్నారని ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+