SSMB29: మహేష్ బాబు వేసుకున్న లాకెట్ ధర ఎంతో తెలుసా..?

సూపర్‌ స్టార్ మహేష్ బాబు 50 వ పుట్టిన రోజును ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. బర్త్ డే కానుకగా అతడు సినిమా రీ- రిలీజ్ తో పాటు వరల్డ్ వైడ్ గా యావత్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'SSMB 29' నుంచి అప్డేట్ రానే వచ్చింది. మూవీ ప్రారంభం అయినప్పటినుంచి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు చిత్ర యూనిట్. అసలు మూవీలో క్యాస్టింగ్ ఏంటి.. షూటింగ్ ఎంత వరకు వచ్చింది.. కథేంటి.. ఇలా ఏదీ కూడా బయటకు రాకుండా డైరెక్టర్ రాజమౌళి జాగ్రత్త పడ్డారు.

అయితే ఆగస్టు 9న మహేష్ బాబు 50వ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ కోసం జక్కన్న అప్డేట్ ఇచ్చారు. మూవీ డెప్త్, వ్యాస్ట్ నెస్ కారణంగా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేమని ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను నవంబర్ లో రివీల్ చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ మేరకు మహేష్ బాబు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో మహేష్ మెడ భాగం మాత్రమే ఉంది. మెడలో రుద్రాక్ష, చుట్టూ రక్తంతో లుక్ ఆసక్తిగా ఉంది. ఇక ఈ సినిమా నుంచి అప్డేట్ నవంబరులో ఇస్తామంటూ ఓ నోట్ పోస్ట్ చేశారు రాజమౌళి. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్​లోకి వచ్చింది.

What s the Price of Mahesh Babu s Locket in SSMB29

అయితే ఈ పోస్టర్ రిలీజైన దగ్గర్నుంచి మహేష్ ధరించిన లాకెట్ ను వెతికేస్తున్నారు. అలాంటి లాకెట్ కావాలని సామాజిక మాధ్యమాల్లో వెతికేస్తున్నారు. ఈ లాకెట్ ను చిత్ర యూనిట్ మహేష్ కోసం స్వయంగా తయారు చేశారా.. లేదా ఎక్కడైనా కొనుగోలు చేశారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే అచ్చం మహేష్ ధరించిన లాకెట్.. ఆన్ లైన్ లో ఓగాన్ అనే సంస్థ విక్రయిస్తోంది. ధాని ధర రూ. 11,500 గా ఉంది. అచ్చం మహేష్ బాబు ధరించిన లాకెట్ మాదిరిగానే ఇదీ ఉంది. దీంతో ఫ్యాన్స్ ఈ లాకెట్ ను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+