సమంతా చెప్పిందేంటి... చేసిందేంటి..?
మన పెద్దలు ఓ సామెత చెబుతుంటారు. చెప్పేదేమో శ్రీరంగనీతులు.. చెసేవన్నీ మంచి పనులు కాదు అని ఆ సామెత అర్థం. రాష్ట్రంలోని అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన అక్కినేని కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన సమంత తనకు భగవంతుడు చేసిన మేలును సరిగా ఉపయగించుకోలేకపోయింది. కారణాలేమైనప్పటికీ నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. ఆ సమయంలో తనపై సానుభూతి వచ్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేది. దీంతో నాగచైతన్యకు మద్దతుగా కొందరు, సమంతకు మద్దతుగా కొందరు నెట్టింట్లో యుద్ధం చేసేవారు. విడిపోయిన కొత్తలోనే జీవితంలో తాను రెండో వివాహం అనేదే చేసుకోను అని ఖరాఖండిగా చెప్పేసింది. అంతేకాదు.. స్త్రీకి స్వాత్రంత్యం లేదని, మహిళలను ఉద్దరించేందుకు, వారి జీవితాలను సరిదిద్దేందుకు తాను పోరాడతానని సమంత చెప్పింది.
పెద్ద పెద్ద డైలాగులు చెప్పింది కానీ..
అంత పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన సమంత హైదరాబాద్ నుంచి ముంబయికి మకాం మార్చింది. తనతో వెబ్ సిరీస్ లు చేస్తున్న దర్శక ద్వయం రాజ్, డీకేల్లో ఒకరైన రాజ్ నిడుమోరును తాజాగా వివాహం చేసుకుంది. వీరిపై కొంతకాలగా రూమర్లు వస్తున్నాయి. ఈ వివాహంతో అవన్నీ నిజమని నిరూపితమైంది. అయితే సమంత ఇక్కడ చాలా పెద్ద తప్పు చేసిందనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. మహిళలను ఉద్ధరిస్తానని గతంలో చెప్పి, ఇప్పుడు మరో మహిళ మానసిక క్షోభకు కారణమైందనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. రాజ్ నిడుమోరు భార్యకు కొన్నాళ్లుగా వీరిద్దరి బంధం ఎంత ఆవేదనకు గురిచేసి ఉంటుందో అర్థం చేసుకోండంటూ నెటిజెన్లు పోస్టులు పెడుతున్నారు. ఆమె పెట్టే పోస్టులు కూడా ఎంతో లోతుగా ఉండేవి. వాటిల్లో ద్విగుణీకృతమైన భావం దాగివుండేది.

మరో స్త్రీ మానసిక క్షోభకు కారణమైన సమంత
రాజ్ నిడుమోరు, సమంత కలిసి ఎప్పటి నుంచి తిరగడం ప్రారంభించారో అప్పటి నుంచే రాజ్ భార్య శ్యామలి మానసికంగా సిద్ధపడివుంటారు. ఎందుకంటే విడిపోక తప్పదని, తాను కాదన్నా వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు.. కలిసుంటారు.. తన మాట వినరు.. తన గౌరవం పోగొట్టుకోవడం కన్నా, ఆ గౌరవాన్ని నిలుపుకుంటూ మౌనంగా పక్కకు తప్పుకోవడం మంచిదని భావించి ఉంటారు. దీంతో సమంత, రాజ్ నిడుమోరు పెళ్లి చేసుకున్నారు. ఒక స్త్రీ సంతోషాన్ని, ఆనందాన్ని పోగొట్టి, ఆమె మానసిక వేదనకు, మానసిక క్షోభకు కారణమైన సమంత ఎన్నాళ్లు రాజ్ నిడుమోరుతో కలిసివుంటుందో చూడాలని నెటిజెన్లు పోస్టులు పెడుతున్నారు. ఆ ఆవేదనను తట్టుకోలేకే రాజ్ నిడిమోరు భార్య ట్వీట్ చేస్తూ తన బాధను బయటపెట్టిందని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications