Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ???

లెజండరీ సింగర్ ఆశా భోస్లే మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆమెను కుటుంబసభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు వెల్లడించారు. ఈ విషాద వార్తతో యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. గాయని మృతి పట్ల పలు రంగాలకు చెందిన ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఫ్యామిలీ..

ఆశా భోస్లే సెప్టెంబర్ 8, 1933న మహారాష్ట్రాలోని సాంగ్లీలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్, సేవంతి దీనానాథ్. అంతే కాకుండా భోస్లే సోదరి లతా మంగేష్కర్ కూడా సంగీత ప్రపంచంలో లెజెండ్ గా ఎదగడమే కాకుండా భారత రత్న అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. అలానే చెల్లెళ్లు మీనా ఖాడికర్, ఉసా మంగేష్కర్, తమ్ముడు హ్రుదయ్ నాథ్ ఉన్నారు. అయితే ఆశాకు 9ఏళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి మరణించడంతో వీరి కుటుంబం పూణే నుంచి కోల్హాపూర్ కు అక్కడి నుంచి ముంబైకి మకాం మార్చింది.

what-special-gift-asha-bhosle-got-from-her-husband-burman-before-her-wedding-and-other-details

పెళ్లి..

ఆశా 16 ఏళ్లకే ప్రేమ వివాహం చేసుకున్నారు. తన కంటే వయసులో పెద్దవారైన గణపత్రావు భోంస్లేను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వీరి వివాహం జరిగింది. దాంతో ఆమె జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని.. కొంతకాలానికే భర్తతో విభేదాలు రావడంతో తన ముగ్గురు పిల్లలతో ఆమె ఒంటరిగా బయటకు రావాల్సి వచ్చిందని చెబుతారు. ఆ తర్వాత సంగీత మాంత్రికుడు ఆర్‌.డి. బర్మన్‌తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరి అపురూప బంధం సినీ చరిత్రలో నిలిచిపోయింది.

కాగా పిల్లల బాధ్యతను మోస్తూనే కెరీర్‌ను కొనసాగిస్తున్న ఆశా భోస్లేకు ఆర్‌.డి. బర్మన్ పరిచయమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన దమ్ మారో దమ్ , చురా లియా హై తుమ్నే వంటి పాటలు రికార్డు క్రియేట్ చేశాయి. అలా వారి మధ్య ఉన్న వృత్తిపరమైన సాన్నిహిత్యం మెల్లగా ప్రేమగా మారిందని అంటుంటారు. ఈ క్రమంలోనే బర్మన్ ఆశా భోంస్లేను పెళ్లి చేసుకోవాలని కోరారని.. అయితే ఆశా మొదట సంకోచించారని సన్నిహితులు తెలుపుతున్నారు.

కానీ బర్మన్ మాత్రం వెనక్కి తగ్గకుండా.. ఒకసారి ఆశా భోస్లేకు ఒక ఖరీదైన గిఫ్ట్ బాక్స్ పంపారట. ఆ బహుమతిని తెరిచి చూస్తే ఒక ఎండిపోయిన గులాబీ పువ్వు ఉందట. నగలు లాంటివి పంపుతారని అనుకుంటే ఈ రకంగా విలక్షణంగా ఆలోచించడం పట్ల ఆమె ఫిదా అయ్యారు. చివరకు 1980లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక బర్మన్ 1994లో చివరి శ్వాస విడిచారు.

మరోవైపు ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన గాయనిగా గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఆశా భోంస్లే జీవితం నేటి తరం మహిళలకు ఒక స్ఫూర్తి.. ఎన్ని కష్టాలు ఎదురైనా తన ప్రతిభతో శిఖరాగ్రానికి ఎలా చేరుకోవచ్చో ఆమె నిరూపించారు. ఇప్పుడు ఆమె మన మధ్యలో లేకపోవడం నిజంగా ఎవరూ పూడ్చని లోటని చెప్పాలి. ఆమె అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+