స్టార్ హీరోకు భార్య గుడ్ బై, ఇండియాలోనే ఖరీదైన విడాకులుగా రికార్డు
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఏ సెలబ్రిటీలు విడాకలు గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం , ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. కొందరు సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత తమ జీవితంలోకి మరో జీవిత భాగస్వామిని ఆహ్వానించడం వంటివి జరుగుతున్నాయి.
ఇదే సమయంలో మరికొందరు విడాకుల తర్వాత సింగిల్‌గానే జీవిస్తున్నారు. అయితే ఓ స్టార్ హీరో తన విడాకులతో వార్తల్లో నిలిచాడు. ఇండియాలోనే అత్యధిక భరణం ఇచ్చిన హీరోగా మనోడు నిలిచాడు. ఆ హీరో మరెవరో కాదు..హృతిక్ రోషన్.బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యం ఖాన్ త్రయానికి గట్టి పోటీ ఇచ్చే హీరోగా హృతిక్ రోషన్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే మధ్యలోనే కాస్తా డౌన్ కావడంతో రేసులో వెనుకపడిపోయాడు.ఇదే సమయంలో హృతిక్ రోషన్ వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది. హృతిక్ రోషన్, సుసానే ఖాన్ 2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.

వీరికి ఇద్దరు పిల్లలు (రెహాన్, రిధాన్) కూడా ఉన్నారు. అయితే, వీరిద్దరూ 2014వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.అయితే కొంతకాలానికి వీరి మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో హృతిక్ రోషన్ తన భార్య సుసానే ఖాన్‌కు విడాకులిచ్చారు.అయితే విడాకుల సమయంలో సుసానే ఖాన్‌కు భారీగా భరణం అందినట్టు వార్తలొచ్చాయి.హృతిక్ రోషన్ తన భార్యకు అత్యధిక మొత్తంలో భరణం చెల్లించినట్లు తెలుస్తోంది. సుస్సానే ఖాన్‌తో విడాకుల సమయంలో, హృతిక్ దాదాపు రూ.380 కోట్లు భరణంగా చెల్లించినట్లు సమాచారం.దీంతో ఇండియాలోనే ఇది అత్యధిక విడాకులుగా నిలిచింది. సుస్సానే ఖాన్‌తో విడాకుల తర్వాత సబా ఆజాద్ అనే అమ్మాయితో హృతిక్ రోషన్ టింగ్ చేస్తున్నాడు.ఈ జంట తరచుగా కలిసి కనిపిస్తూ మీడియాలో ప్రముఖంగా నిలుస్తున్నారు. సబా ఆజాద్ ఒక నటి మరియు సంగీతకారిణి.












Click it and Unblock the Notifications