అల్లు అర్జున్ చేసిన పోస్ట్ ఎవరిని ఉద్దేశించి?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చిత్రం చేస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా రేపో, ఎల్లుండో ప్రకటన వస్తుందంటున్నారు. ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీపై కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పై పవన్ కల్యాణ్ అభిమానులతోపాటు ఇతరులు కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లకుండా వైసీపీకి అభ్యర్థి దగ్గరకు వెళ్లి మద్దతు తెలియజేయడమే దీనికి కారణం.
ఎవరు ఎన్ననుకున్నా ఏమీ చేయలేరు
ఫాదర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని తన నాన్న అల్లు అరవింద్ తో ఉన్న ఫొటోను బన్నీ షేర్ చేశారు. ఈ ఫొటోను జాగ్రత్తగా పరిశీలిస్తే ఎవరు ఎన్ననుకున్నా, ఏమనుకున్నా ఎవరూ నన్ను ఏమీ చేయలేరనే అర్థం వస్తుందంటున్నారు. ఎటువంటి కామెంట్స్ లేకుండా ఉన్న ఆ ఫొటో కచ్చితంగా మెగా ఫ్యామిలీని ఉద్దేశించే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఐకాన్ స్టార్ అంటేనే అల్లు అర్జున్ అని, ఒక్క ఫొటోతో తన ఉద్దేశం ఏమిటో చెప్పేశాడని, ఈ ఒక్క పోస్ట్ తోనే తనను తాను నిరూపించుకున్నాడని అభిమానులు అంటున్నారు.

పుష్ప2 ఫ్లాపవుతుంది
అల్లు అర్జున్ పై జరుగుతున్న ట్రోలింగ్ లో భాగంగా పుష్ప2 విడుదలైతే ఆ సినిమాను ఫ్లాప్ చేస్తామని పవన్ కల్యాణ్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. నంద్యాల వెళ్లడానికి ఒకరోజు ముందు బన్నీ పవన్ కల్యాణ్ కు విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఆ తర్వాతరోజు మాత్రం నేరుగా నంద్యాల వెళ్లి తన మిత్రుడైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలియజేశారు. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా బన్నీని ఆహ్వానించలేదంటున్నారు. ఏదేమైనప్పటికీ మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడానికి ఎవరు ముందుకు వస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications